telangana
29న దీక్షా దివస్ ను జయప్రదం చేయండి.. కేసీఆర్ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది: చిందం రమేష్
సూర్య బోయినపల్లి ..తెలంగాణ చరిత్ర ఉన్నంతకాలం కేసీఆర్ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందని తడగొండ మాజీ సర్పంచ్ చిందం రమేష్ అన్నారు. నవంబర్ 29న జరుగనున్న దీక్షా దివస్ బహిరంగ సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.తెలంగాణ స్వప్నాన్ని సాకారం చేసిన మహోద్యమ ప్రస్థానంలో కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష ఒక చారిత్రాత్మక మైలురాయని ఆయన గుర్తుచేశారు. నాటి త్యాగాలను, ఉద్యమ స్ఫూర్తిని మరోసారి స్మరించుకుంటూ తెలంగాణ ఆత్మగౌరవాన్ని చాటుదామని అన్నారు.