BREAKING
ఇంటిముందు విషాదం.. విద్యుత్ షాక్‌తో మహిళ దుర్మరణం రెండో కొత్త బంతితో బుమ్రాలో పదును తగ్గింది.. సునీల్ గవాస్కర్ కీలక వ్యాఖ్యలు భూ రీ సర్వే కు రైతులు సహకరించాలి… ఆర్ఈసిఎస్ లో అక్రమాలు నిజమే మెదక్ జిల్లా మండల పంచాయతీ అధికారుల సంఘం నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక… లక్కోరా గ్రామంలో బాల్య వివాహ ముక్త్ భారత్ అవగాహన కార్యక్రమం  పంచాయతీ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదు : జిల్లా కలెక్టర్ శ్రీ.పి. రాజాబాబు మోడల్ స్కూల్ విద్యార్థులకు ఐడి కార్డుల పంపిణీ హెచ్ఐవి-ఎయిడ్స్ పై అవగాహన... మార్కెట్ కమిటీ అభివృద్ధికి పాలకవర్గ సభ్యులతో కలిసి కృషి చేస్తా.… 5వ తెలంగాణ రాష్ట్ర పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్–2026 పిల్లలపై లైంగిక వేధింపుల నివారణకు అవగాహన అవసరం ఒంగోలులో యువ సంవాద్ – వికసిత్ భారత్ కార్యక్రమం మహిళలు స్వయం ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి క్రైస్ట్‌చర్చ్ టెస్టు తొలి రోజు ఆటలో న్యూజిలాండ్ పైచేయి.. 246/5తో నిలిచిన ఆతిథ్య జట్టు.

కార్మిక హక్కులే అజెండాగా.. -ఏఐసీసీ ఇన్‌చార్జ్‌తో జనక్ ప్రసాద్ కీలక భేటీ

Select Suryaa Now
కార్మిక హక్కులే అజెండాగా.. -ఏఐసీసీ ఇన్‌చార్జ్‌తో జనక్ ప్రసాద్ కీలక భేటీ
సూర్య-గోదావరిఖని:తెలంగాణ రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి చైర్మన్‌, ఐఎన్‌టీయూసీ సీనియర్ నేత డాక్టర్ బి.జనక్ ప్రసాద్ శుక్రవారం గాంధీభవన్‌లో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల నూతన ఏఐసీసీ ఇన్‌చార్జ్‌ బీఎం.సందీప్ కుమార్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఐఎన్‌టీయూసీ, కాంగ్రెస్ పార్టీ మధ్య ఉన్న సుదీర్ఘ అనుబంధం, పరస్పర సమన్వయం, భవిష్యత్ కార్యాచరణపై ఇరువురూ చర్చించారు.
ముఖ్యంగా కార్మిక రంగానికి సంబంధించిన సమస్యలు, కార్మికుల హక్కుల పరిరక్షణ, సంక్షేమం, కార్మిక సంఘాల బలోపేతం తదితర అంశాలపై జనక్ ప్రసాద్ తన అభిప్రాయాలను ఏఐసీసీ ఇన్‌చార్జ్‌కు వివరించారు. కార్మికుల ప్రయోజనాల పరిరక్షణలో ప్రభుత్వం, కార్మిక సంఘాల మధ్య సమన్వయం, సహకారం మరింత బలోపేతం కావాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు.అనంతరం జనక్ ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ.. కార్మికుల హక్కుల పరిరక్షణ, సంక్షేమం, కార్మిక సంఘాల బలోపేతం కోసం భవిష్యత్తులో చేపట్టాల్సిన కార్యక్రమాలపై సందీప్ కుమార్‌తో సుదీర్ఘంగా చర్చించినట్లు తెలిపారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని చెప్పారు.