కుల రాజకీయాలు చేయకండి
చిత్తూరు ప్రతినిధి మేజర్ న్యూస్: కుల రాజకీయాలు మానుకోవాలని వన్నియకుల క్షత్రియ సంఘం నాయకులు వైసీపీ నేతలను హెచ్చరించారు. శుక్రవారం ఎమ్మెల్యే ప్రజా దర్బార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వన్నియ కుల క్షత్రియ సంఘం నాయకులు హైకోర్టు సీనియర్ న్యాయవాది త్రిమూర్తి, చిత్తూరు నగర ప్రధాన కార్యదర్శి పచప్ప, మాజీ డిప్యూటీ మేయర్ సుబ్రమణ్యం, టిడిపి బీసీ విభాగం నాయకులు వెంకటేష్ యాదవ్, నగర బీసీ అధ్యక్షులు ఉదయ్ కుమార్, 8వ డివిజన్ కార్పొరేటర్ శంకర్ వన్ ఇయర్ కుల క్షత్రియ సంఘం నాయకులు మాట్లాడుతూ గురువారం ఆర్టీవో కార్యాలయంలో చిత్తూరు రూరల్ మండలం పంచాయతీల నామినేషన్ల తిరస్కరణ అప్పిళ్ళ సందర్భంగా అధికార తెలుగుదేశం, ప్రతిపక్ష వైకాపా నాయకుల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఈ వివాదంలో చిత్తూరు నగరానికి చెందిన ఓ వన్నెకుల క్షత్రియ నాయకుడితో పాటు తొమ్మిది గ్రామం అదే కులానికి చెందిన ఓ యువకుడి పై గుర్తుతెలియని వ్యక్తులు దాడి విధితమే ఈ దాడిని తెలుగుదేశానికి ఆపాదిస్తూ చిత్తూరు నియోజకవర్గ వైకాపా ఇన్చార్జి విజయానంద రెడ్డి గురువారం సాయంత్రం సామాజిక మాధ్యమాల్లో ఓ వీడియోను విడుదల చేసి వన్నెకుల క్షత్రియుల మధ్య చిచ్చు పెట్టడం తగదన్నారు. తెలుగుదేశం పార్టీ వన్నియకుల క్షత్రియలకు అవకాశాలు కల్పించి రాజకీయంగా ప్రోత్సాహం అందించిన తెలుగుదేశం పార్టీ చిత్తూరు కార్పొరేషన్ పరిధిలో 60 డివిజన్లకు గాను పది డివిజన్లు వన్యకుల క్షత్రియులకు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ చేస్తున్న అభివృద్ధికి ఎల్లప్పుడూ వన్యకులక్షత్రియులు అండగా ఉంటారని తెలిపారు. ఇకపై కుల రాజకీయాలు మానుకోవాలని వైకాపా నాయకులను హెచ్చరించారు.
ఉమాశంకర్ చిత్తూరు స్టాఫ్ రిపోర్టర్.