కోల్ ఇండియా స్థాయి కబడ్డీ పోటీలకు సింగరేణి క్రీడాకారుడు ఎంపిక
సూర్య, సెంటినరీకాలనీ :కలకత్తా ఈస్టర్న్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ లోని సంక్టోరియా వేదికగా డిసెంబర్-3న జరిగే కోల్ ఇండియా స్థాయి కబడ్డీ పోటీలకు సింగరేణి సంస్థ ఆర్జీ-2 డివిజన్ ఓసీపీ-3 ప్రాజెక్ట్ సిహెచ్ పి లో జనరల్ అసిస్టెంట్ గా పని చేస్తున్న తోట తిరుపతి సింగరేణి జట్టుకు ఎంపికయ్యారని అధికార ప్రతినిధి ఎన్. వేణుగోపాల్ ఒక ప్రకటనలో తెలియజేశారు.ఈ పోటీలలో తోట తిరుపతి సింగరేణి జట్టు తరఫున ప్రాతినిధ్యం వహించనున్నారు. ఎంపికైన క్రీడాకారుడికి ఏరియా జనరల్ మేనేజర్ తాళ్లపల్లి లక్ష్మిపతి గౌడ్ తో పాటు ఏరియా అధికారులు, ఉద్యోగులు, కార్మిక సంఘాల నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. పోటీలలో విజయం సాధించి సింగరేణి సంస్థకు, రామగుండం ఏరియాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.