BREAKING
రెండో కొత్త బంతితో బుమ్రాలో పదును తగ్గింది.. సునీల్ గవాస్కర్ కీలక వ్యాఖ్యలు భూ రీ సర్వే కు రైతులు సహకరించాలి… ఆర్ఈసిఎస్ లో అక్రమాలు నిజమే మెదక్ జిల్లా మండల పంచాయతీ అధికారుల సంఘం నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక… లక్కోరా గ్రామంలో బాల్య వివాహ ముక్త్ భారత్ అవగాహన కార్యక్రమం  పంచాయతీ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదు : జిల్లా కలెక్టర్ శ్రీ.పి. రాజాబాబు మోడల్ స్కూల్ విద్యార్థులకు ఐడి కార్డుల పంపిణీ హెచ్ఐవి-ఎయిడ్స్ పై అవగాహన... మార్కెట్ కమిటీ అభివృద్ధికి పాలకవర్గ సభ్యులతో కలిసి కృషి చేస్తా.… 5వ తెలంగాణ రాష్ట్ర పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్–2026 పిల్లలపై లైంగిక వేధింపుల నివారణకు అవగాహన అవసరం ఒంగోలులో యువ సంవాద్ – వికసిత్ భారత్ కార్యక్రమం మహిళలు స్వయం ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి క్రైస్ట్‌చర్చ్ టెస్టు తొలి రోజు ఆటలో న్యూజిలాండ్ పైచేయి.. 246/5తో నిలిచిన ఆతిథ్య జట్టు. అర్హులైన ప్రతి వ్యక్తికి కుటుంబ బీమాను నమోదు చేయాలి -డిపివో మురళి

వృషకర్మలో ఛాలెంజింగ్ పాత్ర.. విజువల్స్ అద్భుతంగా ఉంటాయంటున్న మీనాక్షి చౌదరి

Select Suryaa Now
వృషకర్మలో ఛాలెంజింగ్ పాత్ర.. విజువల్స్ అద్భుతంగా ఉంటాయంటున్న మీనాక్షి చౌదరి

సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: యువ సామ్రాట్ నాగచైతన్య ప్రధాన పాత్రలో నటించిన మోస్ట్ అవైటెడ్ చిత్రం వృషకర్మ డిసెంబర్ 4న థియేటర్లలో విడుదల కానుంది. పురాతన రహస్యాలు, అతీంద్రియ శక్తుల నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాకు విరూపాక్ష ఫేమ్ కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్నారు. ఎస్‌వీసీసీ, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మిస్తుండగా, బాపినీడు సమర్పిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలతో సినిమాపై భారీ అంచనాలు నెలకొనగా, తాజాగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో హీరోయిన్ మీనాక్షి చౌదరి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

ఈ చిత్రంలో తాను పోషించిన దక్ష పాత్ర కోసం కార్తీక్ దండు ప్రత్యేకమైన లక్షణాలను రూపొందించారని మీనాక్షి చౌదరి తెలిపారు. దక్ష ఎంతో ఫోకస్డ్‌గా ఉండే అమ్మాయి అని, ఆర్కియాలజీలో థీసెస్ చేస్తుందని, ఆ పాత్రకు మంచి గ్రాఫ్ ఉందని చెప్పారు. కథ విన్న తర్వాత నాగచైతన్యతో కలిసి రెండు రోజులు వర్క్‌షాప్ నిర్వహించామని, దర్శకుడి విజన్‌ను అర్థం చేసుకుని రిహార్సల్స్ చేశామని వెల్లడించారు. అలాగే ఆర్కియాలజీకి సంబంధించిన పలు లోతైన విషయాలను కూడా ఈ ప్రాజెక్ట్ ద్వారా నేర్చుకున్నట్లు పేర్కొన్నారు.

వృషకర్మ ప్రపంచం ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందిస్తుందని, విజువలైజేషన్, ట్రీట్‌మెంట్ అద్భుతంగా ఉంటాయని మీనాక్షి చౌదరి అన్నారు. విరూపాక్ష తరహాలోనే ఇది కూడా కంటెంట్ బేస్డ్‌గా ఉంటూనే కమర్షియల్‌గా ఆకట్టుకునేలా ఉంటుందని చెప్పారు. ఎత్తైన ప్రదేశాలంటే తనకు భయమని, ఇందులో అలాంటి సీక్వెన్సులు ఉన్నప్పటికీ ధైర్యంగా పూర్తి చేశానని తెలిపారు. హెవీ సీజీ, వీఎఫ్ఎక్స్ వర్క్ ఉన్న సినిమా చేయడం తనకు కొత్త అనుభవమని, ఎమోషన్స్, కాన్ఫ్లిక్ట్‌ను ప్రతిబింబించేలా సంగీతం ఉంటుందని పేర్కొన్నారు.

నాగచైతన్య చాలా గ్రౌండెడ్‌గా, హంబుల్‌గా, ఫ్రెండ్లీగా ఉంటారని, ఆయనతో కలిసి పనిచేయడం ఎంతో కంఫర్టబుల్‌గా అనిపించిందని మీనాక్షి చెప్పారు. సినిమాలో ప్రతి పాత్ర కీలకంగా ఉంటుందని, విభిన్నమైన పాత్రలు చేయడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు. లక్కీ భాస్కర్ తర్వాత తనకు మదర్ రోల్స్ ఆఫర్ వచ్చినప్పటికీ, ఇప్పటికే అలాంటి పాత్ర చేశాననే కారణంతో అంగీకరించలేదని, కంఫర్టబుల్ జోన్ దాటి కొత్త పాత్రలను ఎంచుకోవడానికే ప్రాధాన్యత ఇస్తానని వెల్లడించారు.