జనవరి 12 విడుదల మూవీ డబ్బింగ్ షురూ.. సంక్రాంతి బరిలో వెంకటేష్, కల్యాణ్ రామ్ సందడి
సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: బ్లాక్‌బస్టర్ దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం జనవరి 12 విడుదల కోసం హీరో నందమూరి కల్యాణ్ రామ్ డబ్బింగ్ ప్రారంభించారు. అనిల్ రావిపూడి దర్శకుడిగా పరిచయమైన పటాస్ తర్వాత వీరిద్దరి కలయికలో రూపొందుతున్న రెండో సినిమా కావడంతో సినీ వర్గాల్లో మంచి ఆసక్తి నెలకొంది. విక్టరీ వెంకటేష్, నందమూరి కల్యాణ్ రామ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ మల్టీస్టారర్‌ను 2027 జనవరి 12న సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది.
ఈ చిత్రంలో కల్యాణ్ రామ్‌ను సరికొత్త స్టైలిష్ లుక్‌లో, విభిన్నమైన పాత్రలో అనిల్ రావిపూడి చూపించబోతున్నారు. వెంకటేష్ సరసన కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తుండగా, కల్యాణ్ రామ్‌కు జోడీగా కృతి శెట్టి కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ అప్‌డేట్స్, ప్రచార చిత్రాలు అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపాయి. మ్యూజికల్ పరంగా కూడా ఈ ప్రాజెక్ట్ మంచి ఊపు మీదుంది. ఇటీవల విడుదలైన తొలి పాట డివికి డివికి అన్ని వేదికలపై కలిపి 35 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి సోషల్ మీడియాలో దూసుకుపోతోంది.
త్వరలోనే మరో పాటను విడుదల చేసేందుకు మేకర్స్ ఏర్పాట్లు చేస్తున్నారు. సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చిన దశలో, మరో పాటతో పాటు కొంత టాకీ భాగం మాత్రమే బ్యాలెన్స్ ఉందని చిత్ర వర్గాలు తెలిపాయి.ప్రచార కార్యక్రమాలను కూడా మేకర్స్ పెద్ద స్థాయిలో ప్లాన్ చేశారు. డిసెంబర్ 26 నుంచి అమెరికాలో విస్తృతమైన ప్రమోషనల్ క్యాంపెయిన్ నిర్వహించనున్నట్లు యూనిట్ వెల్లడించింది. అనిల్ రావిపూడి శైలి వినోదం, స్టార్ కాస్ట్ కలయికతో సంక్రాంతి సీజన్‌లో జనవరి 12 విడుదల చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో చూడాలి.
Also Read: ఇంకొల్లు గ్రామ పంచాయితి సర్పంచ్‌గా షేక్ మహ్మద్ రఫి