ఇంకొల్లు గ్రామ పంచాయితి సర్పంచ్‌గా షేక్ మహ్మద్ రఫి
ఇంకొల్లు, మేజర్‌న్యూస్ :
ఇంకొల్లు మేజర్ పంచాయితి సర్పంచ్ తెలుగుదేశం పార్టీ బలపరచిన అభ్యర్థిగా షేక్ మహ్మద్‌రఫి 2,248 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇంకొల్ల పంచాయితిలో మొత్తం 9,272 ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకున్నారు. మహ్మద్‌రఫి కత్తెర గుర్తుకు 5,562, స్వతంత్ర అభ్యర్థి అద్దంకి సాయి (చారి)కి 3,314, ఉంగరం గుర్తుకు 25 ఓట్లు, బుట్ట గుర్తుకు 43, నోటాకు 98 మంది, చెల్లని ఓట్లు 230 గా నమోదయ్యాయి. దీంతో ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు బలపరచిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి షేక్ మహ్మద్ రఫి సర్పంచ్‌గా గెలుపొందారు. ఈ సందర్భంగా రఫిని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సత్కరించారు. కార్యక్రమంలో ఇంకొల్లు మండల పార్టీ అధ్యక్షులు నాయుడు హనుమంతరావు, ఇంకొల్లు సొసైటి అధ్యక్షులు కరి శ్రీనివాసరావు, పట్టణపార్టీ అధ్యక్షులు వలేరు మార్కు, బి.సి నాయకులు వడ్లమూడి సాంబయ్య, షేక్ ఆరీఫా, బుజ్జి, శివయ్య, తదితరులు పాల్గొన్నారు. బాణా సంచా కాల్చి అభిమానులు, బంధువులు, కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు.
సూర్య రిపోర్టర్ : షేక్ జానిభాష, ఇంకొల్లు.