ఆల్ ఇండియా కరాటే ఓపెన్ ఛాంపియన్ షిప్ 2026 బ్రోచర్ ని ఆవిష్కరించిన గిద్దలూరు శాసనసభ్యులు ముత్తు ముల అశోక్ రెడ్డి
గిద్దలూరు, మేజర్‌న్యూస్ :
ఆల్ ఇండియా ఓపెన్ కరాటే ఛాంపియన్ షిప్ 2026 కరాటే పోటీలు ప్రకాశం జిల్లా ఒంగోలులో డిసెంబర్ 13వ తేదీ టీటీడీ కళ్యాణ మండపం నందు జరిగే పోటీల బ్రోచర్ ను ఉమ్మడి ప్రకాశం జిల్లా కరాటే అసోసియేషన్ చైర్మన్ గిద్దలూరు శాసనసభ్యులు ముత్తముల అశోక్ రెడ్డి గారు బ్రోచర్ ను ఆవిష్కరించారు
ఈ సందర్భంగా గౌ " ఎమ్మెల్యే అశోక్ రెడ్డి మాట్లాడుతూ సిద్ధార్థ కరాటే అకాడమీ గత 44 సంవత్సరం నుంచి ఈ పోటీలు నిర్వహిస్తున్నది ఈనెల 13వ తేదీ జాతీయస్థాయిలో జరిగే కరాటే పోటీలకు ఏడు రాష్ట్రాల నుంచి సుమారు 800 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొంటున్నారు
సిద్ధార్థ కరాటే అకాడమీ జాతీయ అంతర్జాతీయ స్థాయిలో కరాటేపోటీల్లో విజేతలను అందిస్తున్న సంస్థ సిద్ధార్థ అకాడమీ మహిళలకు ఆత్మ రక్షణ పోలీసులకు శిక్షిస్తున్న సంస్థ సిద్ధార్థ అకాడమీ అని ఈనెల 13వ తేదీన ఒంగోలులో జరిగే జాతీయస్థాయి కరాటే పోటీలను జయప్రదం చేయాలని కోరారు
ఈ కార్యక్రమంలో సిద్ధార్థ కరాటే అకాడమీ ఫౌండర్ మరియు ఆర్గనైజర్ నల్లూరి మోహన్రావు, ప్రకాశం జిల్లా కరాటే అసోసియేషన్ ఉపాధ్యక్షులు మారెళ్ళ సుబ్బారావు, సిద్ధార్థ కరాటే అకాడమీ ప్రధాన కార్యదర్శి మండవ సుబ్బారావు, స్థానిక కరాటే మాస్టర్స్ పి చాంద్ బాషా, షేషావలి, సుబ్రమణ్యం రంగారెడ్డి, శ్రీధర్, షబ్బీర్ మహబూబ్ బాషా తదితరులు పాల్గొన్నారు