ధర్మశాల అడ్వెంచర్ క్యాంప్‌కు కర్నూలు విద్యార్థులు*
*కర్నూలు, నవంబర్ 27:* రాయలసీమ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్‌కు చెందిన ఐదుగురు NSS వాలంటీర్లు జాతీయ స్థాయి అడ్వెంచర్ క్యాంప్‌కు ఎంపికైనట్లు యూనివర్సిటీ వర్గాలు తెలిపాయి.
హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాలలో డిసెంబర్ 1 నుంచి 10 వరకు జరిగే ఈ క్యాంప్‌లో బేడల్ లక్ష్మీ లిఖిత, మాచర్ల రేణుక, కొర్ర శివరాం నాయక్, మామిళ్ల నాగ కీర్తి, ముడే సంతోష్ నాయక్ పాల్గొంటారు.ఎంపికైన విద్యార్థులను వీసీ ఆచార్య వి.వెంకట బసవరావు,ప్రిన్సిపాల్ ప్రొ.వెంకట సుందరానంద పుచ్చ తదితరులు అభినందించారు.