telangana
అంబేద్కర్, పూలే భవనాన్ని నిర్మించాలని నిరసన
సూర్య, హుజురాబాద్:అంబేద్కర్, పూలే భవనం నిర్మాణం పూర్తి కాలేదని, వెంటనే ప్రభుత్వం స్పందించి భవనం పూర్తి చేయాలని కోరుతూ శుక్రవారం హుజురాబాద్ పట్టణంలో మార్నింగ్ ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. అంబేద్కర్ విగ్రహం నుండి నిర్మాణం ఆగిపోయిన భవనం వరకు ఫ్లెక్సీతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ... నియోజకవర్గ కేంద్రమైన హుజురాబాద్ లో గత ప్రభుత్వ హయాంలో అంబేద్కర్, పూలే నిధులు మంజూరై... పనులు మొదలై మధ్యలో ఆగిపోయాయని అన్నారు. వివిధ కారణాల వల్ల ఆగిపోయిన భవనాన్ని ప్రభుత్వం స్పందించి భవన నిర్మాణ పనులు జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. మార్నింగ్ ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో భవన నిర్మాణం పూర్తయ్య వరకు నిరసనలు తెలుపుతామని అన్నారు. నిర్మాణం పూర్తి కాకపోవడంతో ఆ ప్రాంతమంతా చెత్తాచెదారంతో నిండిపోయి మలవిసర్జన, మూత్రవిసర్జనకు నిలయంగా మారిందని అన్నారు. మున్సిపల్ అధికారులు స్పందించి ఈ ప్రాంతాన్ని శుభ్రం చేయాలని, ప్రభుత్వం నిధులు కేటాయించి భవన నిర్మాణానికి సహకరించాలని అన్నారు. మార్నింగ్ ఫ్రెండ్స్ కోరిక మేరకు మున్సిపల్ అధికారులు భవన నిర్మాణ ప్రాంతానికి జెసిబి తో చదును చేశారు. ఈ కార్యక్రమంలో మార్నింగ్ ఫ్రెండ్స్ స్థాపకులు, సామాజికవేత్త, కౌన్సిలర్ వర్ధినేని రవీందర్ రావు, పాక సతీష్, పలకల ఈశ్వర్ రెడ్డి, వేల్పుల రత్నం, సొల్లు బాబు, కొలిపాక సమ్మయ్య, కొలిపాక శంకర్, మారపల్లి శ్రీనివాస్, కేసిరెడ్డి నరసింహా రెడ్డి, బత్తుల సమ్మయ్య, సురేందర్, వేల్పుల ప్రభాకర్, కేసరి మధుకర్ రావు, ఎంపటి సతీష్, మామిడిపల్లి సాయి, కుమార్, తిరుపతి, మైఖేల్, సదానందం తదితరులు పాల్గొన్నారు.