BREAKING
ఇంటిముందు విషాదం.. విద్యుత్ షాక్‌తో మహిళ దుర్మరణం రెండో కొత్త బంతితో బుమ్రాలో పదును తగ్గింది.. సునీల్ గవాస్కర్ కీలక వ్యాఖ్యలు భూ రీ సర్వే కు రైతులు సహకరించాలి… ఆర్ఈసిఎస్ లో అక్రమాలు నిజమే మెదక్ జిల్లా మండల పంచాయతీ అధికారుల సంఘం నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక… లక్కోరా గ్రామంలో బాల్య వివాహ ముక్త్ భారత్ అవగాహన కార్యక్రమం  పంచాయతీ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదు : జిల్లా కలెక్టర్ శ్రీ.పి. రాజాబాబు మోడల్ స్కూల్ విద్యార్థులకు ఐడి కార్డుల పంపిణీ హెచ్ఐవి-ఎయిడ్స్ పై అవగాహన... మార్కెట్ కమిటీ అభివృద్ధికి పాలకవర్గ సభ్యులతో కలిసి కృషి చేస్తా.… 5వ తెలంగాణ రాష్ట్ర పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్–2026 పిల్లలపై లైంగిక వేధింపుల నివారణకు అవగాహన అవసరం ఒంగోలులో యువ సంవాద్ – వికసిత్ భారత్ కార్యక్రమం మహిళలు స్వయం ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి క్రైస్ట్‌చర్చ్ టెస్టు తొలి రోజు ఆటలో న్యూజిలాండ్ పైచేయి.. 246/5తో నిలిచిన ఆతిథ్య జట్టు.

సీఎం,రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం చిత్రపటాలకు పాలాభిషేకం..

Select Suryaa Now
సీఎం,రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం చిత్రపటాలకు పాలాభిషేకం..
 
సూర్య మల్యాల: కాంగ్రెస్ ప్రభుత్వం నూతనంగా మంజూరు చేసిన చేయూత పెన్షన్ల నగదు లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమచేయడంతో లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బత్తిని శ్రీనివాస్ గౌడ్, యూవజన కాంగ్రెస్ అధ్యక్షులు శనిగరపు తిరుపతి ఆధ్వర్యంలోమండల కేంద్రంలో శుక్రవారం లబ్ధిదారులతో కలిసి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే డాక్టర్ మేడిపల్లి సత్యం చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు.అలాగే మండలంలోని అన్ని గ్రామాల్లోని సర్పంచుల ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పాలాభిషేకం నిర్వహించారుమండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బత్తిని శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. గత పది సంవత్సరాలుగా పెన్షన్ల కోసం ఎదురుచూస్తున్న అర్హులైన లబ్ధిదారులకు కాంగ్రెస్ ప్రభుత్వం నూతనంగా పెన్షన్లు మంజూరు చేసి వారి ఖాతాల్లో నగదు జమ చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. వృద్ధులు, దివ్యాంగులు, ఇతర అర్హులైన లబ్ధిదారులకు పెన్షన్ అందడం వారి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే కాకుండా ఎంతో ఊరటనిస్తుందని పేర్కొన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం మాటలకే పరిమితమైన ప్రభుత్వం కాదని, ప్రజలకు ఇచ్చిన హామీలను కార్యరూపంలో అమలు చేస్తూ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ అందించేందుకు కృషి చేస్తోందని తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి నక్క అనిల్,సర్పంచులు ఇట్టిరెడ్డి శ్వేతా రెడ్డి, జంగలి హనుమంతు, బద్ధం సంధ్య తిరుపతిరెడ్డి, మెట్పల్లి లత, మరాఠీ సంధ్యా సత్తయ్య, గాతం అంజయ్య, బల్మూరి పాపారావు, కొండపలకల గోదాదేవి, గుర్రం విజయ్, కరుణ, గాదం కుమార్ ఉపసర్పంచ్, పొన్నం మల్లేశంగౌడ్ కంచర్ల లక్ష్మణ చారి బీసీ సెల్ మండల అధ్యక్షులు దిండు ప్రవీణ్ కుమార్ మహిళ నాయకులు లహరి, మంద తిరుపతి,దూస వెంకన్న, మురళి, ఇట్టే రమణ నాయకులు చేయూత పెన్షన్ లబ్ధిదారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.