మంగళగిరిలో మునిసిపల్ చైర్మన్ శ్రీరామ్ చినబాబు బిజీబిజీ : ఎన్నికల సరళిని పరిశీలించిన తెలుగు యువత రథసారధి
మదనపల్లి రూరల్,మేజర్ న్యూస్ : మంగళగిరి-తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో మంత్రి నారా లోకేష్ ఆదేశాలతో రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడు,మదనపల్లె మున్సిపల్ చైర్మన్ గుండ్లపల్లి శ్రీరామ్ చినబాబు మంగళగిరిలో పర్యటించారు.ఈ సందర్భంగా సంబంధిత వార్డులోని పోలింగ్ బూత్‌ను సందర్శించి,ఎన్నికల నిర్వహణ తీరును పరిశీలించారు.పోలింగ్ కేంద్రంలో ఓటింగ్ సరళి,ఎన్నికల నిర్వహణకు చేసిన ఏర్పాట్లపై ఆయన ఆరా తీశారు.పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా,సజావుగా సాగుతున్న తీరును గమనించారు.ఎన్నికల నిర్వహణకు సంబంధించిన వివరాలను పరిశీలిస్తూ,పోలింగ్ కేంద్రంలోని పరిస్థితులను సమీక్షించారు.ఈ సందర్భంగా శ్రీరామ్ చినబాబు మాట్లాడుతూ కూటమి పాలన పట్ల ప్రజలు పూర్తి సంతృప్తితో ఉన్నారన్నారు. సూపర్ సిక్స్ పథకాల ద్వారా ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలు అందుతున్నాయన్నారు.ఎన్నికలు ఏవైనా విజయం కూటమిదేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
రిపోర్టర్ : కే.ఈశ్వర్ రెడ్డి,మదనపల్లి నియోజకవర్గం ఇంచార్జి