ఇందిరమ్మ బీమాను సద్వినియోగం చేసుకోవాలి…
దుబ్బాక;రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని 18 వ వార్డు కౌన్సిలర్ శ్రీరామ్ సరస్వతి నరేందర్ కోరారు. శుక్రవారం 18 వ వార్డులోని నీలకంఠ భజన మండలి భవన్ లో ఇందిరమ్మ బీమా పథకాన్ని కమిషనర్ మహేష్ కుమార్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.18 నుంచి 59 సంవత్సరాల వయస్సు కలిగిన కుటుంబంలోని సంపాదించే ఒక వ్యక్తికి రూ.5 లక్షల జీవిత బీమా సదుపాయం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ బీమా ప్రీమియాన్ని ప్రభుత్వమే భరిస్తుందని, లబ్ధిదారులు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. అర్హులైన వారు తమ రేషన్ కార్డు, ఆధార్ కార్డు, మొబైల్ నంబరుతో కేంద్రానికి వచ్చి బీమా నమోదు చేసుకోవాలని సూచించారు. రేషన్ కార్డు ఈ-కేవైసీ పూర్తి చేసుకోవాలని, బీమా పొందే వ్యక్తి తన నామినీ వివరాలను కూడా నమోదు చేయించుకోవాలని తెలిపారు. పెట్టి నమోదు కేంద్రం రెండు రోజులు అందుబాటులో ఉంటుందని నమోదు ప్రక్రియ పూర్తి చేసుకోవాలని వార్డు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఆకుల భరత్ కుమార్, కాంగ్రెస్ దుబ్బాక మున్సిపల్ అధ్యక్షుడు మల్లు గారి రామచంద్రారెడ్డి, వార్డు అధికారి సంధ్యారాణి, ఆర్ పి విజయలక్ష్మి, వార్డు సభ్యులు పిబి శ్రీనివాస్, యాదగిరి, ఎంకంగారి నరసింహారెడ్డి, భూమయ్య తో పాటు తదితరులు పాల్గొన్నారు.