వికాస్ వివాహ వేడుకకు విచ్చేసిన అతిథులకు కంచర్ల భాస్కరరావు కృతజ్ఞతలు
సూర్య,అశ్వరావుపేట తన పెద్ద కుమారుడు వికాస్, శ్రీ విష్ణుప్రియ వివాహ మహోత్సవాన్ని పురస్కరించుకుని వివాహ వేడుకకు విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించిన మిత్రులు, శ్రేయోభిలాషులు, బంధుమిత్రులు, కుటుంబ సభ్యులందరికీ చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు, చంద్ర మోటార్స్ హీరో షోరూం అధినేత కంచర్ల భాస్కరరావు, ఆయన సతీమణి శ్రీలక్ష్మి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
తమ ఆహ్వానాన్ని మన్నించి విలువైన సమయాన్ని కేటాయించి కుటుంబ సమేతంగా వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించడం ఎంతో ఆనందాన్ని కలిగించిందని పేర్కొన్నారు. అందరి ఆత్మీయత, అభిమానంతో వివాహ వేడుక ఎంతో ఘనంగా, సంతోషంగా జరిగిందని తెలిపారు.
వివాహ వేడుకలో ఏవైనా చిన్నచిన్న లోపాలు జరిగి ఉంటే పెద్ద మనసుతో మన్నించాలని కోరారు. నూతన వధూవరులైన వికాస్, శ్రీ విష్ణుప్రియ దంపతులపై అందరి ఆశీస్సులు, ఆదరాభిమానాలు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. ఈ మేరకు కంచర్ల భాస్కరరావు, శ్రీలక్ష్మి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
సూర్య రిపోర్టర్ మునీర్ ఆర్ సి అశ్వరావుపేట