*కోహెడ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీలలో భాగంగా సిద్దిపేట పోలీస్ కమిషనర్ రష్మి పెరుమాళ్ ఐపిఎస్ తనిఖీ చేశారు.*
కోహెడ;పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న కమిషనర్‌కు కోహెడ ఎస్ఐ అభిలాష్ ముందుగా సిబ్బందితో రిపోర్ట్ చేశారు. అనంతరం ఎస్ఐ పరేడ్ నిర్వహిస్తే సిపి పరిశీలించారు. అనంతరం సిబ్బంది యొక్క కిట్ ఆర్టికల్స్‌ను, పోలీస్ స్టేషన్ ఆవరణలో ఉన్న వివిధ కేసులకు సంబంధించిన వాహనాలను తనిఖీ చేసి అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. పోలీస్ స్టేషన్ పరిసరాలను,రికార్డులు మరియు అన్ని వర్టికల్స్ పనితీరును సీపీ క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ప్రతి పోలీస్ అధికారి, సిబ్బంది విధుల్లో క్రమశిక్షణ, నిబద్ధతతో విధులు నిర్వహించాలి. ప్రజల సమస్యలను ఓపికగా విని, వాటిని త్వరితగతిన పరిష్కరించాలి. కమ్యూనిటీ పోలీసింగ్‌కు అధిక ప్రాధాన్యతనిస్తూ ప్రజల్లో పోలీసు వ్యవస్థపై నమ్మకాన్ని పెంచాలి అని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో శాంతిభద్రతల పరిరక్షణకు, నేరాల నియంత్రణకు ప్రతి గ్రామంలో 'సిద్దిపేట సురక్ష నేత్ర' కార్యక్రమంలో భాగంగా సీసీటీవీ కెమెరాల నిఘాను పెంచేలా ఎస్ఐ చర్యలు తీసుకోవాలి అని తెలిపారు. అనంతరం సిబ్బంది యొక్క సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి వర్టికల్ ఇన్‌చార్జ్ తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలని ఆదేశించారు. ఈ తనిఖీలో హుస్నాబాద్ ఏసిపి సదానందం, ట్రైనీ డీఎస్పీలు సుమా, భారత్ రెడ్డి, ఏండి . ముషరఫ్ , హుస్నాబాద్ సీఐ శ్రీదర్, ఎస్ఐ అభిలాష్ , సిబ్బంది పాల్గొన్నారు.