నార్త్ రాజుపాలెం 10వ వార్డులో ఎన్నికల వివాదం..
నెల్లూరు జిల్లా | కోవూరు నియోజకవర్గం
నార్త్ రాజుపాలెం 10వ వార్డులో ఎన్నికల వివాదం..
కొడవలూరు మండలం నార్త్ రాజుపాలెం గ్రామంలో థర్డ్ ఫేజ్ ఎన్నికల నేపథ్యంలో 10వ వార్డు ఏకగ్రీవంపై వివాదం నెలకొంది..
???? వైసీపీ బలపరిచిన అభ్యర్థి వీరి రమణమ్మ ఏకగ్రీవమైనట్లు తొలుత ప్రకటన..
???? ఐదు నిమిషాలకే నిర్ణయం మార్చుకున్న ఆర్వో.. అభ్యర్థి వివరాలు తెలియక ఏకగ్రీవం ప్రకటించామని వివరణ ఇచ్చినట్లు సమాచారం..
???? టీడీపీ నాయకుల ఒత్తిడితోనే నిర్ణయం మార్చారని వైసీపీ వర్గాల ఆరోపణ..
???? కొడవలూరు ఎస్సై కోటిరెడ్డి వ్యవహారశైలిపై కూడా వైసీపీ నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.
???? కలెక్టర్ నుంచి మరోసారి ఆర్డర్ తెచ్చుకున్నామని అధికారులు చెబుతున్నప్పటికీ, ఆర్డర్ కాపీ అడిగితే ఆర్వో దాటవేత ధోరణి అవలంబిస్తున్నారని ఆరోపణలు..
ఐదు నిమిషాల్లోనే నిర్ణయం ఎలా మారింది?
కలెక్టర్ ఆదేశాల మేరకు నిర్ణయం మార్చినట్లయితే ఆర్డర్ కాపీ ఎందుకు చూపడం లేదు?
ఎన్నికల అధికారుల తీరుపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో, నార్త్ రాజుపాలెం 10వ వార్డు వివాదంపై జిల్లా కలెక్టర్ తక్షణమే జోక్యం చేసుకుని పూర్తి వివరాలతో విచారణ జరిపించాలని వైసీపీ వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి..