అయ్యప్పకు ఘనంగా మండల పూజలు
అయ్యప్పకు ఘనంగా మండల పూజలు
స్థానిక వేదయపాలెం వేద శాస్త్ర అయ్యప్ప స్వామి దేవస్థానం నందు శుక్ర వారం కేరళ సాంప్రదాయ కార్తీకమాస మండల పూజల లో భాగంగా తొలుత ఉదయం అయ్యప్ప స్వామి పాలాభిషేకం గణపతి హోమం ఉష పూజ శ్రీ వేలి ఉత్సవం కలశపూజ నవకాభిషేకం ఉత్సవం మధ్యాహ్నం ఉచ్చ పూజ శ్రీవేలి ఉత్సవం సాయంత్రం మహాదీపారాధన భగవతి సేవా అత్తాళ పూజ శ్రీ వేలి ఉత్సవం పడి కర్పూరం హరివరాసనం కార్యక్రమాలు జరిగాయి. ఆలయ చైర్మన్ గూడల శేషగిరిరావు, కార్యదర్శి కత్తుల వెంకటరత్నం, కోశాధికారి గడ్డం రత్తయ్య పర్యవేక్షణలో జరిగిన మండల పూజలకు నారదాసు రవి శ్రీ విద్యా దంపతులు మధ్యాహ్నం అన్నదానంకు బిరదవోలు శ్రీకాంత్ రెడ్డి రాధిక దంపతులు, దండముని మల్లిక, ముని వెంకట చరితవ్య,వేలూరు మల్లీశ్వరి, సురేంద్ర గోనుగుంట చంద్రశేఖర్ ప్రవల్లిక దంపతులు,రాత్రి స్వాములు బిక్షకు రావి రాజేశ్వరి దంపతులు, కొమ్మి రాజబాబు వరలక్ష్మి దంపతులు ఉభయకర్తలు వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో కేజీ శంకరం బొగ్గుల మురళీమోహన్ రెడ్డి పావళ్ళ ప్రసాద్ పసుపులేటి అశోక్ చంద్ర పలువురు అయ్యప్పలు భక్తులు పాల్గొన్నారు.