నెల్లూరు జిల్లా యూత్ కాంగ్రెస్ కమిటీ ఏర్పాటు.. నూతన అధ్యక్షుడిగా ఆలీ
నెల్లూరు జిల్లా యూత్ కాంగ్రెస్ కమిటీ ఏర్పాటు.. నూతన అధ్యక్షుడిగా ఆలీ
నూతన కమిటీకి రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు పవన్ తేజ అభినందనలు
రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసే లక్ష్యంతో ప్రజలకు సేవలందించాలని పిలుపు
నెల్లూరు, నవంబర్ 27: నెల్లూరు జిల్లా యూత్ కాంగ్రెస్ కమిటీని శుక్రవారం ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు నూనె పవన్ తేజ, రాష్ట్ర యువజన కాంగ్రెస్ ఇన్‌చార్జ్ లెనిన్ ప్రసాద్, నెల్లూరు యూత్ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ విజయ్‌కు జిల్లా యూత్ కాంగ్రెస్ నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నూతన జిల్లా యూత్ కాంగ్రెస్ కమిటీని ఏర్పాటు చేసి, పార్టీ బలోపేతానికి యువ నాయకులు సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలనే లక్ష్యంతో యూత్ కాంగ్రెస్ నాయకులు ప్రజలకు సేవలందిస్తూ, పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఈ సందర్భంగా నాయకులు సూచించారు.
కార్యక్రమం అనంతరం రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు నూనె పవన్ తేజ, నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ఏఐసీసీ సభ్యులు, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఆస్తుల పర్యవేక్షణ కమిటీ చైర్మన్ చేవూరు దేవకుమార్ రెడ్డి నివాసానికి వెళ్లి ఆయనను కలిశారు. శాలువాతో సత్కరించి ఆశీస్సులు తీసుకున్నారు.
ఈ సందర్భంగా చేవూరు దేవకుమార్ రెడ్డి మాట్లాడుతూ, జిల్లాలో పార్టీని నమ్ముకొని ఎన్నో సంవత్సరాలుగా పనిచేస్తున్న సీనియర్ నాయకులు, కార్యకర్తలను కలుపుకొని యూత్ కాంగ్రెస్ కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. పార్టీ జెండాను మోస్తూ కష్టపడుతున్న ప్రతి ఒక్కరికి గుర్తింపు, ప్రాధాన్యత కల్పిస్తూ సమష్టిగా ముందుకు సాగాలని రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడికి సూచించారు.
ఈ కార్యక్రమంలో నెల్లూరు ఇన్‌చార్జ్ ఫయాజ్, నెల్లూరు యూత్ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ విజయ్, నూతనంగా ఎన్నికైన జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆలీ, సీనియర్ నాయకులు, మాజీ నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షుడు ఎన్. మోహన్ రెడ్డి, మైనార్టీ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు షన్వాస్ చిట్టి, సీనియర్ యూత్ కాంగ్రెస్ నాయకులు గణేష్ బాబు, నరేష్, సయ్యద్ ముజీర్ రోజార్, సీనియర్ యూత్ కాంగ్రెస్ నాయకురాలు సయ్యద్ నసీమా, మైనార్టీ ఉపాధ్యక్షుడు షేక్ జహీర్, 63వ డివిజన్ ఇన్‌చార్జ్, యూత్ కాంగ్రెస్ నాయకులు, అభిమానులు పాల్గొన్నారు.