తాగునీరు, పారిశుద్ధ్య పనులను సమన్వయంతో వేగవంతం చేయాలి
- జల్ జీవన్ మిషన్, స్వచ్ఛ భారత్ మిషన్ (గ్రామీణ్) లక్ష్యాలను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలి
- పెండింగ్‌లో ఉన్న వ్యక్తిగత మరుగుదొడ్లు, సామాజిక పారిశుద్ధ్య సముదాయాల నిర్మాణాలు పూర్తి చేయాలి
- జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్.
కాకినాడ, మేజర్ న్యూస్ :
జిల్లాలో గ్రామీణ ప్రజలకు సురక్షితమైన తాగునీరు అందించడంతో పాటు పారిశుద్ధ్య ప్రమాణాలను మెరుగుపరిచేందుకు జల్ జీవన్ మిషన్, స్వచ్ఛ భారత్ మిషన్ (గ్రామీణ్) కార్యక్రమాలను సమన్వయంతో పటిష్టంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
శుక్రవారం స్థానిక కలెక్టరేట్ లో జిల్లా గ్రామీణ పారిశుద్ధ్య మిషన్ పనుల పురోగతిపై జిల్లా కలెక్టర్ అధ్యక్షతన సంబంధిత లైన్ డిపార్ట్ మెంట్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జల్ జీవన్ మిషన్, స్వచ్ఛ భారత్ మిషన్ (గ్రామీణ్) కింద చేపడుతున్న పనులు, పెండింగ్‌లో ఉన్న వ్యక్తిగత గృహ మరుగుదొడ్లు, సామాజిక పారిశుద్ధ్య సముదాయాలు, కమ్యూనిటీ సోక్ పిట్ల నిర్మాణాలు, నిధుల వినియోగం, తాగునీటి నాణ్యత, గ్రామీణ పారి శుద్ధ్య నిర్వహణ తదితర అంశాలపై సమీక్షించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... గత ఆర్థిక సంవత్సరాల్లో వివిధ దశల్లో మంజూరై ఇంకా అసంపూర్తిగా ఉన్న పనులను గుర్తించి, వాటి ని పూర్తి చేసేందుకు నిర్దిష్ట గడువులు విధించుకుని వేగవంతంగా పూర్తి చే యాలన్నారు. డిసెంబర్ 02 తర్వాత నూతన పనులకు అవసరమైన టెండర్ల ప్రక్రియ ను పూర్తి చేసి పనులు ప్రారంభించాలని సూచించారు.
ఏజెన్సీల పనితీరుపై ప్రత్యేక సమీక్ష
పనులు ప్రారంభించడంలో జాప్యం చేస్తున్న ఏజెన్సీల పనితీరును సమీక్షించాలని, స్పందిం చని ఏజెన్సీలకు సంబంధించిన పనులను రద్దు చేసి ప్రత్యామ్నాయ ఏజెన్సీలకు అప్పగించే అంశాన్ని పరిశీలించాలని కలెక్టర్ సూచించారు. కొత్త ఏజెన్సీకి పనులు అప్పగిస్తే సిబ్బంది సమీకరణ, క్షేత్రస్థాయి ఏర్పాట్లకు సమయం పట్టే అవకాశం ఉన్నందున, ఇప్పటికే క్షేత్రస్థాయి అవగాహన, సిబ్బంది ఉన్న పాత ఏజెన్సీ తక్షణమే పనులు ప్రారంభించే అవకాశాన్ని కూడా పరిశీలించాలన్నారు. ఇందుకోసం పాత ఏజెన్సీ ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేయాలని, అవసరమైతే తన స్థాయిలో కూడా సమావేశం నిర్వహిస్తానని తెలిపారు.
గతంలో విడుదల చేసిన నిధులకు అనుగుణంగా పెండింగ్‌లో ఉన్న కుళాయి కనెక్షన్లు, పైపులైన్ల పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. పనుల అమలులో లైన్ డిపార్ట్‌మెంట్ల పరంగా ఎదురవుతున్న సమస్యలను గుర్తించి పరిష్కరించాలన్నారు.
వ్యక్తిగత, సామాజిక పారిశుద్ధ్య నిర్మాణాలు పూర్తి చేయాలి
గతంలో మంజూరై అసంపూర్తి గా ఉన్న వ్యక్తిగత గృహ మరుగు దొడ్ల నిర్మాణాలను గుర్తించి త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. అలాగే కొత్త సామాజిక పారిశుద్ధ్య సముదాయాల నిర్మాణానికి అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. సంతలు, బస్టాండ్లు, ఆలయాలు, పంచాయతీ కార్యాల యాలు వంటి ప్రజలు అధికంగా రాకపోకలు సాగించే ప్రాంతాల్లో వీటి నిర్మాణానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
గ్రామాల్లో ఇళ్ల నుంచి వెలువడే వాడుక నీరు నిల్వ ఉండకుండా సోక్ పిట్లు, తగిన పారుదల, శుద్ధి ఏర్పాట్లు చేపట్టాలని తెలిపారు. దీనివల్ల దోమల వ్యాప్తి, అపరిశుభ్రతను నివారించడంతో పాటు భూగర్భ జలాల కాలుష్యాన్ని అరికట్టవచ్చన్నారు. అవసరమైన ప్రాంతాల్లో సామాజిక ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసి, శుద్ధి చేసిన వాడుక నీటిని వ్యవసాయ అవసరాలకు లేదా భూగర్భ జలాల పునరుద్ధరణకు వినియోగించేలా కార్యాచరణ రూపొందించాలని సూచించారు.
ప్రతి ఇంటికీ సురక్షిత తాగునీరు అందించాలి.
జల్ జీవన్ మిషన్ అమలు పై సమీక్షిస్తూ ప్రతి గ్రామీణ కుటుంబానికి ఫంక్షనల్ హౌస్‌హోల్డ్ ట్యాప్ కనెక్షన్ ద్వారా సురక్షితమైన, తగినంత తాగునీరు అందించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రతి వ్యక్తికి రోజుకు కనీసం 55 లీటర్ల తాగునీటిని నిర్దేశిత నాణ్యతా ప్రమాణాల మేరకు సరఫరా చేసే లక్ష్యంతో పనులను పర్యవేక్షించాలన్నారు. పైపులైన్లు, నీటి నిల్వ ట్యాంకులు, పంపింగ్ వ్యవస్థలు, ఇతర మౌలిక సదుపాయాల పనుల్లో జాప్యం లేకుండా చూడా లని ఆదేశించారు. త్రాగునీటి నాణ్యతను క్రమం తప్పకుండా పరిశీలన చేయాలన్నారు
అమరజీవి జలధార, వాటర్ గ్రిడ్ పనులపై దృష్టి
అమరజీవి జలధార ప్రాజెక్టు ద్వారా ప్రాంతీయ స్థాయిలో, సమూహ గ్రామాలకు తాగునీరు అందించే వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుల పురోగతిని సమీక్షించారు.ఆయా ప్రాజెక్టులకు గ్రామాల అనుసంధానం, నీటి సరఫరా వ్యవస్థల సామర్థ్యం, నిర్వహణ అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారు లకు సూచించారు.
పెదపూడి నందు త్రాగునీటి యూనిట్ కి సంబంధించిన ట్రాన్స్ఫా ర్మర్ సమస్యను పరిష్క రిస్తామన్నారు వేసవిలో తాగునీటి ఎద్దడి నివార ణకు ముందస్తు చర్యలు తీసుకుని వచ్చే వేసవిలో గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు కార్యాచరణ రూపొందిం చాలని కలెక్టర్ ఆదేశిం చారు. తక్కువ నిల్వ సామర్థ్యం ఉన్న చెరువుల ను గుర్తించి,వాటి సామర్థ్యాన్ని పెంచేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. చెరువులకు సంబంధిం చిన పనులను త్వరిత గతిన పూర్తి చేయడం ద్వారా వచ్చే వేసవి నాటికి నీటి సమస్యను చాలావరకు అధిగమించ వచ్చన్నారు. ప్రతి అంశం లో లైన్ డిపార్ట్మెంట్ అధికారులు క్రియా శీలకంగా వ్యవహరించి సురక్షిత త్రాగునీరు పారిశుద్ధ్య వ్యవస్థల పనితీరును మెరుగు పరచాలన్నారు
తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య సౌకర్యాలు పరస్పరం అనుసం ధానమైన అంశాలని, ఈ రెండు కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయడం ద్వారా గ్రామీణ ప్రజల ఆరోగ్యం, జీవన ప్రమాణాలు మెరుగుప డతాయని తెలిపారు.
సంబంధిత శాఖల అధికారులు సమ న్వయంతో పనిచేస్తూ మంజూరైన నిధులను నిబంధనల మేరకు సద్వినియోగం చేసుకో వాలని, పనుల పురోగ తిపై ఎప్పటికప్పుడు నివేదికలు సమర్పించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
ఈ సమావేశంలో ఆర్.డబ్ల్యూ.ఎస్. ఎస్ఈ మతిన్, డిపిఓ వీ రవికుమార్, జల శాఖ డిడి మురళీకృష్ణ, డిఎం అండ్ హెచ్ఓ కే.అనిత, జెడ్పి సీఈవో లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.