విద్యార్థి దశ నుండి మాదకద్రవ్యాలపై అవగాహన అవసరం
-‘శ్రీ అగస్త్య' డ్రగ్స్ అవేర్ నెస్ ప్రోగ్రాంలో జడ్జి శ్రీవల్లి
కాకినాడ, నవంబర్ 27:- విద్యార్థి దశ నుండే డ్రగ్స్ (మాదక ద్రవ్యాలు) పట్ల అవగాహన పెంపొందించుకుని, వాటికి దూరంగా ఉండాలని 1వ అడిషినల్ జూనియర్ సివిల్ జడ్జి ఏ.వెంకటసాయి శ్రీవల్లి సూచించారు. స్థానిక గాంధీనగర్ లోని శ్రీ అగస్త్య జూనియర్ కళాశాలలో శుక్రవారం ఉదయం విద్యార్థులకు డగ్స్ అడిక్షన్ (మాదక ద్రవ్యాల వ్యసనం)పై అవగాహన సదస్సు నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ చక్రవర్తి అధ్యక్షతన జరిగిన ఈ సదస్సుకు ఆమె ముఖ్యఅతిథిగా విచ్చేసి డ్రగ్స్ వలన కలిగే నష్టాలను విద్యార్థులకు వివరించారు.
మాదక ద్రవ్యాల వ్యసనం వలన మెదడు పనితీరును మార్చి చదువు లేదా పనిపై దృష్టి తగ్గడం, కుటుంబం, స్నేహితులకు దూరంగా ఉండటం, ఆర్థిక, చట్టపరమైన సమస్యలలో చిక్కుకుంటామన్నారు. డ్రగ్స్ కు దూరంగా ఉండటం వలన ఆరోగ్యాన్ని, భవిష్యత్తును కాపాడుకోవచ్చునన్నారు. దేశంలో అధిక సంఖ్యలో యువత మాదక ద్రవ్యాలకు అలవాటు పడుతున్నారని, చెడు వ్యసనాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదన్నారు. స్వచ్చంధ సంస్థల భాగస్వామ్యంతో డ్రగ్స్ కు వ్యతిరేకంగా అవగాహన సదస్సులు నిర్వహించడం అభినందనీయమన్నారు.
ఈ కార్యక్రమంలో ప్యానల్ లాయర్స్ మరియు లీగల్ సెల్ కమిటీ ప్రతినిధులు పి.ఏసుబాబు, కె.రాజశేఖర్, బి.దుర్గాభవానీ, ఏ.శైలజ, వి.బి.ఎస్.బహదూర్ షా, ఆర్.మల్లిఖార్జునరావు, శ్రీ అగస్త్య ఎడ్యుకేషనల్ సొసైటీ కో- ఆర్డినేటర్ అల్లుమల్లు ఏలియా, బోధన మరియు బోధనేతర సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.