సొంతింటి కలను సాకారం చేసుకోవాలి. సర్పంచ్ రాణి మల్లేశం
మర్కుక్; అర్హులైన ప్రతి ఒక్కరూ ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని సద్వినియోగం చేసుకొని సొంతింటి కలను సాకారం చేసుకోవాలని మర్కుక్ గ్రామ సర్పంచ్ రాణి మల్లేశం సూచించారు. గ్రామంలో పెంకుటిళ్లలో నివసిస్తున్న అర్హులైన కుటుంబాలు ప్రభుత్వ పథకానికి దరఖాస్తు చేసుకొని ప్రయోజనం పొందాలని కోరారు.మర్కుక్ గ్రామానికి చెందిన అచ్చంగారి రాధాశీను కు ఇందిరమ్మ ఇల్లు మంజూరు కావడంతో శుక్రవారం సర్పంచ్ రాణి మల్లేశం లబ్ధిదారులతో కలిసి ఇంటి నిర్మాణ పనులకు ముగ్గుపోసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పేద కుటుంబాలకు సొంతింటి కలను సాకారం చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకాన్ని అమలు చేస్తోందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు సతీష్ గౌడ్, పుట్ట రవి, నాగరాజు, పంచాయతీ కార్యదర్శి మంజుల, తదితరులు ఉన్నారు.