BREAKING
*శ్రీరాములపల్లి గ్రామంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ పేదకుటుంబాలకు ఆర్థిక భరోసా – ప్రజాసేవే లక్ష్యం* హాకీ ఇండియా లీగ్ 2026–27 జనవరిలో ప్రారంభం.. డిసెంబర్ 7న ఆటగాళ్ల వేలం భూముల రి సర్వేకు రైతులు సహకరించాలి...… *హరీశ్ రావు చేతుల మీదుగా టీఆర్ఆర్ఎస్ నాలుగో మహాసభ పోస్టర్ ఆవిష్కరణ* ఎమ్మెల్యే టి. రామ్మోహన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన చందర్ రాథోడ్ *మోడల్ స్కూల్ ఆట స్థలాన్ని రక్షించండి జాతీయ రహదారిపై బీజేపీ ధర్నా* పేదల సొంతింటి కలకు సాకారం.. హరీశ్ రావు వ్యాఖ్యలకు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దరిపల్లి చంద్రం ఘాటు కౌంటర్ ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో కర్రసాము అరంగేట్రం.. తెలంగాణ సంప్రదాయ కళకు జాతీయ గుర్తింపు పోక్సో కేసులో నిందితుడికి జీవిత ఖైదు ఆకాశంలో ఒక తార సినిమాపై కేటీఆర్ ప్రశంసలు.. చాలా కాలం తర్వాత అందమైన చిత్రం చూశానంటూ పోస్ట్ గెస్ట్ లెక్చరర్ల పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం -కేజీబీవీ ఇన్‌చార్జి స్పెషల్ ఆఫీసర్ బి. లక్ష్మి *మైసంపల్లి గ్రామ ప్రజల చిరకాల కోరిక నెరవేరింది బస్సు సౌకర్యం కలిపించిన గ్రామ సర్పంచ్ పకిడే సంపత్* *ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులకు తొమ్మిది నెలలుగా వేతనాలు లేవా? జిల్లా, రాష్ట్ర విద్యాశాఖ అధికారులు ఏం చేస్తున్నారు* జీ5 ఓటీటీలోకి తమిళ సస్పెన్స్ థ్రిల్లర్ సిరీస్ ఆక్టోపస్.. ఏడు ఎపిసోడ్లతో స్ట్రీమింగ్ ప్రారంభం

లోక్‌సభ సీట్ల 50% పెంపు చరిత్రాత్మక నిర్ణయం: సీఎం చంద్రబాబు

Select Suryaa Now
లోక్‌సభ సీట్ల 50% పెంపు చరిత్రాత్మక నిర్ణయం: సీఎం చంద్రబాబు

న్యూఢిల్లీ, సూర్య ప్రతినిధి: దేశవ్యాప్తంగా లోక్‌సభ స్థానాలను 50 శాతం పెంచాలని కేంద్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వాగతించారు. ఇది అత్యంత చారిత్రాత్మకమైన నిర్ణయమని, దీనికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని ఆయన ప్రకటించారు. శుక్రవారం న్యూఢిల్లీలో కేంద్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, హెచ్.డి. కుమారస్వామిలతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు.

మూడు దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న మహిళా రిజర్వేషన్ల కల ఈ బిల్లుతో సాకారం కాబోతోందని చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. దేశ జనాభాలో సగభాగంగా ఉన్న మహిళలకు చట్టసభల్లో 33 శాతం ప్రాతినిధ్యం కల్పించడం గొప్ప ముందడుగు అని పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు ఈ బిల్లుకు మద్దతు ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు.

దక్షిణాది రాష్ట్రాలకు ఏమాత్రం నష్టం లేదు:

కుటుంబ నియంత్రణను సమర్థవంతంగా అమలు చేయడంలో ఆంధ్రప్రదేశ్ సహా దక్షిణాది రాష్ట్రాలు ముందున్నాయని, కేంద్ర ప్రభుత్వ విధానాలను పాటించడం ఆ రాష్ట్రాలకు శాపం కాకూడదని తాము కేంద్రాన్ని కోరినట్లు చంద్రబాబు తెలిపారు. దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి అన్యాయం జరగకూడదన్న తమ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ.. అన్నీ ఆలోచించే అన్ని రాష్ట్రాల్లో సమానంగా 50 శాతం లోక్‌సభ స్థానాలను పెంచేందుకు నిర్ణయం తీసుకున్నారని వివరించారు.

ఈ నిర్ణయంతో దేశంలోని మొత్తం సీట్లలో దక్షిణాది వాటా (23.76 శాతం) ఏమాత్రం తగ్గకుండా యథాతథంగా ఉంటుందని, ఏపీలో లోక్‌సభ సీట్లు 25 నుంచి 38కి, తెలంగాణలో 17 నుంచి 26కి పెరగనున్నాయని చంద్రబాబు గణాంకాలతో సహా వెల్లడించారు. కాగా, నవంబర్ 30న ప్రారంభం కానున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ప్రవేశపెట్టనున్న ఈ బిల్లుకు టీడీపీ ఎంపీలంతా మద్దతు తెలుపుతారని ఆయన స్పష్టం చేశారు.