గంగవరంలో ఎల్లంపల్లి మురళి ఘన విజయం 1,080 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపు.. ఉపసర్పంచ్‌గా శ్రావణి ఎన్నిక
పలమనేరు మేజర్ న్యూస్ గంగవరం గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో కూటమి బలపరిచిన అభ్యర్థి ఎల్లంపల్లి మురళి ఘన విజయం సాధించారు. హోరాహోరీగా సాగిన ఎన్నికల పోరులో తన సమీప ప్రత్యర్థులపై 1,080 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించి సర్పంచ్ పీఠాన్ని కైవసం చేసుకున్నారు. అదేవిధంగా ఉపసర్పంచ్‌గా శ్రావణి ఎన్నికయ్యారు.మురళి సాధించిన భారీ విజయంతో గంగవరంలో కూటమి శ్రేణులు, అభిమానులు సంబరాలు చేసుకున్నారు. గ్రామ ప్రజలు, కార్యకర్తలు పూలమాలలు వేసి ఆయనకు ఘనంగా అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఎల్లంపల్లి మురళి మాట్లాడుతూ తనపై నమ్మకంతో భారీ మెజారిటీతో గెలిపించిన గంగవరం గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ విజయం తన ఒక్కరిదే కాదని, కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజల సమష్టి విజయమని పేర్కొన్నారు. ప్రజల ఆశయాలకు అనుగుణంగా గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
రిపోర్టర్ అనిల్ కుమార్ యాదవ్