BREAKING
కాకినాడ నగరపాలక సంస్థ ఎన్నికల బ్యాలెట్ బాక్సుల భద్రతా ఏర్పాట్ల ను పరిశీలించిన జిల్లా స్థానిక సంస్థల సాధారణ పరిశీలకులు లావణ్య వేణి భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి మైపాల తాతాజీ ఘన నివాళి: మహిళల స్వయం ఉపాధికి ఆరాధ్య ఫౌండేషన్ చేయూత అంబేద్కర్ ఆశయాలను ఆచరణలో పెట్టాలి నాలుగు ఏకగ్రీవం.. 22 పల్లెల్లో ఎన్నికల సమరం! పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా కార్తీక పౌర్ణమి వేడుకల అనంతరం చెత్తకుప్పగా కీసరగుట్ట.. పట్టించుకునేదెవరు? వెంకట్రావుపల్లిలో గ్రానైట్ చోరీ.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ఎస్ఐ మాచవరం మెట్ల కాలనీలో సర్పంచ్ అభ్యర్థి మైపాల తాతాజీ ముమ్మర ఎన్నికల ప్రచారం: రాజ్యాంగ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు మహిళలకు ఉచిత మగ్గం వర్క్ శిక్షణ మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యం మసీదులో నమాజ్‌కు రాజకీయాలతో సంబంధం లేదు.. అన్నారంలో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు పోలింగ్ కేంద్రాలను సందర్శించి పరిస్థితిని సమీక్షించిన రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా ద్వారకామాయి కాలనీ అభివృద్ధికి రూ.23 లక్షలతో సీసీ రోడ్డు మంజూరు

పోలింగ్ కేంద్రాలను సందర్శించి పరిస్థితిని సమీక్షించిన రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా

Select Suryaa Now
 పోలింగ్ కేంద్రాలను సందర్శించి పరిస్థితిని సమీక్షించిన రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా

విజయవాడ, మేజర్‌న్యూస్‌ :

రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న 23 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు, ఫేజ్-1 గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోందని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా తెలిపారు.

గురువారం విజయవాడలోని రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయం నుంచి ఎన్నికల నిర్వహణపై, క్షేత్రస్థాయిలో పోలింగ్ సరళిని పరిశీలించేందుకు తాడిగడప మున్సిపాలిటీ పరిధిలోని కానూరు రవీంద్ర భారతి స్కూల్, విజ్ఞాన విహార్ సందర్శించిన అనంతరం మీడియా తో మాట్లాడుతూ, ఎన్టీఆర్ జిల్లా విజయవాడ రూరల్ మండలంలోని ఎనికేపాడు గ్రామ పంచాయతీ పోలింగ్ కేంద్రాలను సందర్శించానన్నారు. రాష్ట్రంలో ఫేజ్-1 గ్రామ పంచాయతీ ఎన్నికలతో పాటు 23 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ గురువారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైందని తెలిపారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణపై కమిషనర్, పంచాయతీరాజ్ శాఖ నుంచి, పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలపై కమిషనర్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ఎప్పటికప్పుడు నివేదికలు అందుతున్నాయని పేర్కొన్నారు.

క్షేత్రస్థాయిలో పోలింగ్ నిర్వహణ, ఓటర్లకు కల్పించిన సౌకర్యాలు, పోలింగ్ ఏజెంట్లకు ఎదురవుతున్న సమస్యలు, ఎన్నికల సిబ్బంది విధుల నిర్వహణను స్వయంగా పరిశీలించేందుకు పోలింగ్ కేంద్రాలను సందర్శించినట్లు తెలిపారు. తాడిగడప మున్సిపాలిటీ పరిధిలోని రవీంద్ర భారతి స్కూల్ లో పోలింగ్ కేంద్రాన్ని, ఎన్టీఆర్ జిల్లా విజయవాడ రూరల్ మండలంలోని ఎనికేపాడు గ్రామ పంచాయతీ లోని విజ్ఞాన విహార్ పోలింగ్ కేంద్రాలను సందర్శించి పోలింగ్ సరళిని పరిశీలించినట్లు వివరించారు.

పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు, పోలింగ్ ఏజెంట్లు, ప్రిసైడింగ్ అధికారులు, ఇతర ఎన్నికల సిబ్బందితో మాట్లాడి పరిస్థితులను తెలుసుకున్నామని, ఎలాంటి ఇబ్బందులు లేదా ఫిర్యాదులు లేవని వారు వెల్లడించినట్లు తెలిపారు.

పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు స్వేచ్ఛగా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించు కుంటున్నారని, ఎన్నికల ప్రక్రియ సజావుగా కొనసాగుతోందని పేర్కొన్నారు.

ఉదయం 9 గంటల సమయానికి పట్టణ స్థానిక సంస్థల పరిధిలో సుమారు 13 శాతం పోలింగ్ నమోదైందని, విజయవాడ రూరల్ మండలంలోని గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పరిశీలన సమయానికి 45 శాతానికి పైగా పోలింగ్ నమోదైనట్లు తెలిపారు.

గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ మధ్యాహ్నం 1 గంటకు ముగిసిన అనంతరం బ్యాలెట్ బాక్సులను సంబంధిత గ్రామ పంచాయతీ భవనాలకు తరలించి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభిస్తారని తెలిపారు.

గ్రామ పంచాయతీ ఎన్నికల కౌంటింగ్‌ను అదే రోజు సాయంత్రంలోగా పూర్తి చేసి ఫలితాలు ప్రకటించేలా జిల్లా కలెక్టర్లకు తగిన మార్గదర్శకాలు ఇచ్చినట్లు వెల్లడించారు. పంచాయతీ కౌంటింగ్ సాయంత్రంలోగా పూర్తి చేసేందుకు ఏర్పాట్లు చేసినట్లు వివరించారని తెలిపారు.

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటర్ల నుంచి మంచి స్పందన కనిపిస్తోందని, చెన్నైలో పనిచేస్తున్న ఒక మహిళా ఐటీ ఉద్యోగి ప్రత్యేకంగా స్వగ్రామానికి వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవడం సంతోషకరమని పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, ఇతర ప్రాంతాల్లో పనిచేస్తున్న వారు కూడా ఉదయమే తమ స్వగ్రామాలకు వెళ్లి ఓటు వేస్తున్నారని, ఇది ప్రజల్లో ప్రజాస్వామ్య ప్రక్రియ పట్ల ఉన్న ఆసక్తి, బాధ్యతకు నిదర్శనమని అన్నారు. 2021 లో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సుమారు 81 శాతం పోలింగ్ నమోదైందని, ఈసారి కూడా ఓటింగ్ శాతం పెరుగుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు.

గత 2021 జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో సుమారు 60 శాతం పోలింగ్ నమోదు కాగా, ఈసారి సుమారు 70 శాతం నమోదైందని, గతంతో పోలిస్తే దాదాపు 10 శాతం పెరుగుదల కనిపించిందని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా అందుతున్న సమాచారం ప్రకారం ఎన్నికలు సాధారణంగా ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్నాయని తెలిపారు.  సంబంధిత జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారని పేర్కొన్నారు. అవసరమైన ప్రాంతాల్లో అదనపు పోలీసు బలగాలను పంపించి పరిస్థితిని అదుపులోకి తీసుకురావాలని అధికారులకు సూచించినట్లు తెలిపారు.

ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా, ప్రతి ఓటరుకు ఎలాంటి భయం, ఒత్తిడి లేకుండా స్వేచ్ఛగా ఓటు వేసే అవకాశం కల్పించాలని అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఎన్నికల అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా పూర్తయ్యేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా కోరారు.