కాకినాడ నగరపాలక సంస్థ ఎన్నికల బ్యాలెట్ బాక్సుల భద్రతా ఏర్పాట్ల ను పరిశీలించిన జిల్లా స్థానిక సంస్థల సాధారణ పరిశీలకులు లావణ్య వేణి
కాకినాడ, మేజర్ న్యూస్ : కాకినాడ నగరపాలక సంస్థ ఎన్నికల పోలింగ్ అనంతరం బ్యాలెట్ బాక్సులను భద్ర పరిచిన స్ట్రాంగ్ రూముల వద్ద చేపట్టిన భద్రతా ఏర్పాట్లను స్థానిక సంస్థల జిల్లా సాధారణ పరిశీలకులు బి. లావణ్య వేణి గురు వారం స్థానిక రంగరాయ వైద్య కళాశాల నందు పరిశీలించారు.
ఈ సందర్భంగా నగర పాలక సంస్థ మున్సిపల్ కమిషనర్, అదనపు ఎన్నికల అధికారి ఎన్.వి.వి. సత్యనారా యణ స్ట్రాంగ్ రూముల్లో బ్యాలెట్ బాక్సుల భద్రత కు కౌంటింగ్ ప్రక్రియ కొరకు చేపట్టిన చర్యలను సాధారణ పరిశీలకులకు వివ రించారు.
అనంతరం స్ట్రాంగ్ రూముల కోసం ఏర్పాటు చేసిన గదులను సాధారణ పరిశీలకులు స్వయం గా పరిశీలించి, బ్యాలెట్ బాక్సుల భద్రతకు తీసుకుంటున్న చర్యలను కౌంటింగ్ ప్రక్రియ కొరకు చేపట్టిన చర్యలను సమీక్షించారు.
భద్రతా ఏర్పాట్లలో ఎలాంటి లోపాలకు తావులేకుండా నిరంతర అప్రమత్తతతో ఎన్నికల సంఘం మార్గదర్శ కాలు ప్రకారం విధులు నిర్వ హించాలని,ఎన్నికల నిబంధనల మేరకు పటిష్టమైన భద్రతను కొనసాగించాలని సంబం ధిత అధికారులకు పలు సూచనలు జారీ చేశారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీవో ఎస్ మల్లిబాబు, స్ట్రాంగ్ రూముల భద్రతా పర్య వేక్షణకు నియమిం చబడిన అధికారులు,పోలీసులు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.