BREAKING
ఇంటింటికీ మెరుగైన వైద్యం అందేలా పనిచేయాలి గొట్టిపల్లి సర్పంచ్‌గా అవ్వ తేజేశ్వరి ఏకగ్రీవ ఎన్నిక.. గత ప్రభుత్వ హయాంలోనే హుజురాబాద్ అభివృద్ధి -- ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పూర్ణిమకు మద్దతుగా మహిళల భారీ ర్యాలీ రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు కోటబొమ్మాళి విద్యార్థిని ఎంపిక ఆర్థిక సహాయం...... మేజర్ పంచాయతీ పోరు రసవత్తరం.. భూ వివాదాలకు తావులేని గ్రామాలే లక్ష్యం. తెలంగాణ ఉద్యమ చరిత్రను వక్రీకరించే ప్రయత్నాలను తిప్పికొట్టాలి 14-15 ఏళ్ల బాలికలకు ఉచిత హెచ్పివి వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహణ గిజబ సర్పంచ్‌గా బాధ్యతలు చేపట్టిన మరడాన ఉషారాణి దీక్ష దివాస్ ను విజయవంతం చేయాలి వెంకటాపురం గ్రామ సర్పంచ్ బుధిత్ బుడితీ రమణమ్మ.గౌరీ నాయుడులను అభినందించిన మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు గాదిరాయి పంచాయతీ టిడిపి ఏకగ్రీవం.. సర్పంచ్‌గా పెంటకోట భవాని టొబాకో ఫ్రీ యూత్ క్యాంపెయిన్

నియోజకవర్గాల పునర్విభజన బిల్లులకు గ్రహగతుల ప్రభావం?

Select Suryaa Now
నియోజకవర్గాల పునర్విభజన బిల్లులకు గ్రహగతుల ప్రభావం?

* ప్రముఖ జ్యోతిష్య పండితుడు లక్కోజు శివరామ విశ్వకర్మ

విశాఖపట్నం, నవంబర్ 27, మేజర్ న్యూస్: నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ల సవరణ బిల్లుల విషయంలో కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వానికి ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యే అవకాశముందని ప్రముఖ వాస్తు, జ్యోతిష్య పండితుడు లక్కోజు శివరామ విశ్వకర్మ పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన శుక్రవారం మధ్యాహ్నం సేవాతీర్థ్‌లో జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ల సవరణ బిల్లులకు ఆమోదం లభించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయని ఆయన పేర్కొన్నారు. నవంబర్ 30 నుంచి డిసెంబర్ 3 వరకు జరగనున్న పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో ఈ బిల్లులను ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు.

అయితే ప్రస్తుత నవగ్రహాల సంచారం, గ్రహస్థితులు, గోచార ఫలితాలను జ్యోతిష్యశాస్త్ర పరంగా పరిశీలిస్తే ఈ బిల్లులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఆశించిన ఫలితాలు లభించకపోవచ్చని అభిప్రాయపడ్డారు. బిల్లుల ప్రవేశం లేదా ఆమోద ప్రక్రియ వాయిదా పడే అవకాశముందని, లేక ఎన్డీయే ప్రభుత్వానికి నిరాశాజనక పరిణామాలు ఎదురుకావచ్చని జ్యోతిష్య అంచనా వ్యక్తం చేశారు.