BREAKING
కోల్ ఇండియా స్థాయి క్రీడా పోటీలను ఘనంగా నిర్వహించాలి బంగారం కోసం వృద్ధురాలి హత్య కేసు... -- ముగ్గురు నిందితులకు జీవిత ఖైదు ఆపదలో ఉన్న కుటుంబానికి అండగా మంత్రి శ్రీధర్ బాబు సర్పంచ్ అభ్యర్థులతో పోలీసుల ఎన్నికల అవగాహన సమావేశం ఇంటింటికీ మెరుగైన వైద్యం అందేలా పనిచేయాలి గొట్టిపల్లి సర్పంచ్‌గా అవ్వ తేజేశ్వరి ఏకగ్రీవ ఎన్నిక.. గత ప్రభుత్వ హయాంలోనే హుజురాబాద్ అభివృద్ధి -- ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పూర్ణిమకు మద్దతుగా మహిళల భారీ ర్యాలీ రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు కోటబొమ్మాళి విద్యార్థిని ఎంపిక ఆర్థిక సహాయం...... మేజర్ పంచాయతీ పోరు రసవత్తరం.. భూ వివాదాలకు తావులేని గ్రామాలే లక్ష్యం. తెలంగాణ ఉద్యమ చరిత్రను వక్రీకరించే ప్రయత్నాలను తిప్పికొట్టాలి 14-15 ఏళ్ల బాలికలకు ఉచిత హెచ్పివి వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహణ గిజబ సర్పంచ్‌గా బాధ్యతలు చేపట్టిన మరడాన ఉషారాణి

గాదిరాయి పంచాయతీ టిడిపి ఏకగ్రీవం.. సర్పంచ్‌గా పెంటకోట భవాని

Select Suryaa Now
గాదిరాయి పంచాయతీ టిడిపి  ఏకగ్రీవం.. సర్పంచ్‌గా పెంటకోట భవాని

  వి. మాడుగుల మేజర్ న్యూస్ : మాడుగుల మండలం గాదిరాయి గ్రామ పంచాయతీ ఎన్నికలు శుక్రవారం ఏకగ్రీవంగా ముగిశాయి. గ్రామ అభివృద్ధి, ఐక్యతను దృష్టిలో ఉంచుకుని ప్రధాన పార్టీలైన టీడీపీ, వైసీపీ నాయకులు కుదుర్చుకున్న అవగాహన ఒప్పందం మేరకు సర్పంచ్‌గా పెంటకోట భవాని, ఉప సర్పంచ్‌గా పర్రె రామోజీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.గ్రామంలో ఎన్నికల వాతావరణం, విభేదాలకు తావులేకుండా పంచాయతీని ఏకగ్రీవం చేసేందుకు ఇరు పార్టీల ముఖ్య నాయకులు, గ్రామ పెద్దలు సమావేశమై కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ ఒప్పందం ప్రకారం ఐదేళ్ల పదవీకాలంలో మొదటి రెండున్నర సంవత్సరాలు టీడీపీకి, ఆ తర్వాతి రెండున్నర సంవత్సరాలు వైసీపీకి సర్పంచ్ పదవి దక్కేలా అంగీకారానికి వచ్చారు. అదేవిధంగా గ్రామంలోని మొత్తం 10 వార్డులకు గాను 5 వార్డు సభ్యుల స్థానాలను టీడీపీకి, మరో 5 వార్డు సభ్యుల స్థానాలను వైసీపీకి కేటాయిస్తూ ఏకగ్రీవంగా తీర్మానించారు.ఈ ఒప్పందంలో భాగంగా తొలి విడతలో టీడీపీ తరఫున పెంటకోట భవాని సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. పంచాయతీ పాలకవర్గం ఏకగ్రీవం కావడంపై గ్రామస్థులు, ఇరు పార్టీల నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ నూతన సర్పంచ్ పెంటకోట భవాని, ఉప సర్పంచ్ బర్రె రామోజీ మరియు వార్డు సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.