BREAKING
మూడు నెలలుగా తాగునీటి సరఫరా బంద్-20వ వార్డు ప్రజల అవస్థలు! వికసిత్ భారత్ నిర్మాణంలో విశ్వ విద్యాలయాలు కీలక పాత్ర పోషించాలి-రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల మృతుని కుటుంబానికి అండగా నిలిచిన కౌన్సిలర్ బెజ్జంకి పూర్ణ చారి అంబాల- పరకాల బస్సు ప్రయాణం దుమ్ము ధూళితో నరకం స్పెషల్ క్యాంపెయిన్ డే కార్యక్రమాన్ని పరిశీలించిన పరకాల ఆర్డివో *ఘనంగా ముగిసిన మాదిగల వన సమారాధన* అమెరికా మార్కెట్ల పతనాన్ని అవకాశంగా మార్చుకుంటున్న భారతీయ ఇన్వెస్టర్లు.. ఉద్యోగుల నియామకాలు పెంచకుండానే భారత ఐటీ రంగం వృద్ధి.. ఉద్యోగాలపై నాస్కామ్ కీలక విశ్లేషణ! అధిక ప్యాసింజర్లతో వెళ్లే ఆటోలపై రవాణా శాఖ అధికారుల ప్రత్యేక అవగాహన కార్యక్రమం ఆంత్రోపిక్ ఐపీఓకు గంటల్లోనే లక్ష మందికి పైగా గ్రో యూజర్ల ఆసక్తి.. ఆ స్పందనతో ప్రణాళికలు మార్చుకున్న సంస్థ! ఆంత్రోపిక్ ఐపీఓకు గంటల్లోనే లక్ష మందికి పైగా గ్రో యూజర్ల ఆసక్తి.. ఆ స్పందనతో ప్రణాళికలు మార్చుకున్న సంస్థ! ధాన్యం కొనుగోళ్లపై జిల్లా కలెక్టర్ సమీక్ష వీధి కుక్కల నుండి ప్రజలను కాపాడాలి... జిల్లా కలెక్టర్ఆశీష్ సంఘ్వాన్ ఎస్‌బీఐ చిన్న, మధ్యతరహా వ్యాపార రుణ పరిమితి పెంపు.. ఎంఎస్‌ఎంఈ రంగానికి భారీ ఊతం! నేడు మండలానికి రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారులు రాక

పసికందు వైద్యానికి ఖాకీల ఆపన్నహస్తం

Select Suryaa Now
పసికందు వైద్యానికి ఖాకీల ఆపన్నహస్తం

తోటి ఉద్యోగి కష్టానికి చలించి రూ.53 వేల విరాళం

గాజువాక, నవంబర్ 27, మేజర్ న్యూస్ : ఆపదలో ఉన్న తోటి ఉద్యోగి కుటుంబానికి మేమున్నామంటూ గాజువాక పోలీసులు ఉదారత చాటుకున్నారు. విశాఖ నగర టూటౌన్‌ ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌లో మహిళా హెడ్‌ కానిస్టేబుల్‌గా (2009 బ్యాచ్‌) విధులు నిర్వహిస్తున్న సుస్సన్నకు ఇటీవల నెలలు నిండకముందే బిడ్డ జన్మించింది. ప్రస్తుతం ఆ పసికందు మెడికవర్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. చిన్నారి వైద్యానికి సుమారు రూ.18 లక్షల వరకు ఖర్చవుతుందని వైద్యులు తెలపడంతో ఆ కుటుంబం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది.

     విషయం తెలుసుకున్న గాజువాక పోలీస్‌ స్టేషన్‌ సిబ్బంది మానవతా దృక్పథంతో స్పందించారు. శాంతిభద్రతల విభాగం సిబ్బంది రూ.43 వేలు, క్రైమ్‌ విభాగం సిబ్బంది రూ.10 వేలు చొప్పున మొత్తం రూ.53 వేల ఆర్థిక సాయాన్ని సమీకరించారు. ఈ నగదును గాజువాక సీఐ వాసునాయుడు చేతుల మీదుగా బాధిత కుటుంబానికి అందజేశారు. విధి నిర్వహణలోనే కాకుండా తోటి సిబ్బంది కష్టసుఖాల్లోనూ అండగా నిలుస్తామని పోలీసులు ఈ సందర్భంగా పేర్కొన్నారు. చిన్నారి త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో ఇంటికి చేరుకోవాలని వారంతా ఆకాంక్షించారు.