BREAKING
ఇంటింటికీ మెరుగైన వైద్యం అందేలా పనిచేయాలి గొట్టిపల్లి సర్పంచ్‌గా అవ్వ తేజేశ్వరి ఏకగ్రీవ ఎన్నిక.. గత ప్రభుత్వ హయాంలోనే హుజురాబాద్ అభివృద్ధి -- ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పూర్ణిమకు మద్దతుగా మహిళల భారీ ర్యాలీ రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు కోటబొమ్మాళి విద్యార్థిని ఎంపిక ఆర్థిక సహాయం...... మేజర్ పంచాయతీ పోరు రసవత్తరం.. భూ వివాదాలకు తావులేని గ్రామాలే లక్ష్యం. తెలంగాణ ఉద్యమ చరిత్రను వక్రీకరించే ప్రయత్నాలను తిప్పికొట్టాలి 14-15 ఏళ్ల బాలికలకు ఉచిత హెచ్పివి వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహణ గిజబ సర్పంచ్‌గా బాధ్యతలు చేపట్టిన మరడాన ఉషారాణి దీక్ష దివాస్ ను విజయవంతం చేయాలి వెంకటాపురం గ్రామ సర్పంచ్ బుధిత్ బుడితీ రమణమ్మ.గౌరీ నాయుడులను అభినందించిన మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు గాదిరాయి పంచాయతీ టిడిపి ఏకగ్రీవం.. సర్పంచ్‌గా పెంటకోట భవాని టొబాకో ఫ్రీ యూత్ క్యాంపెయిన్

మూడు దశాబ్దాల సేవకు ‘గ్రామ పీఠం’ పిలుపు.. వేమగిరి బరిలో ప్రజావైద్యుని కుటుంబం!

Select Suryaa Now
మూడు దశాబ్దాల సేవకు ‘గ్రామ పీఠం’ పిలుపు.. వేమగిరి బరిలో ప్రజావైద్యుని కుటుంబం!

ఎస్.రాయవరం, నవంబర్ 27, మేజర్ న్యూస్: సాధారణంగా ఎన్నికలంటే అభ్యర్థులు ఓటర్ల చుట్టూ తిరుగుతారు.. కానీ వేమగిరి గ్రామంలో మాత్రం ఊరి ప్రజలే తమ అభిమాన వైద్యుని కుటుంబాన్ని వెతుక్కుంటూ వచ్చి, "మా ఊరి బాధ్యత మీరే తీసుకోవాలి" అంటూ పట్టుబట్టి సర్పంచ్ బరిలో నిలిపారు.
​గత 30 ఏళ్లుగా ఆపదలో ఉన్న గ్రామీణులకు అపర సంజీవనిలా నిలిచి, అత్యవసర వైద్య సేవలు అందిస్తున్న వెంకట్రావు కుటుంబంపై వేమగిరి ప్రజలు చూపిస్తున్న ఆదరాభిమానాలకు నిదర్శనమే ఈ ఎన్నిక. దివంగత ఆదర్శ ఉపాధ్యాయుడు స్వర్గీయ కొమ్మోజు రంగారావు ఒకవైపు విద్యాబుద్ధులు నేర్పుతూనే, మరోవైపు గ్రామీణ ఆరోగ్య పరిరక్షణ కోసం తపించారు. ఆ అన్న ఆశయ సాధనే ఊపిరిగా, మూడు దశాబ్దాలుగా వైద్య సేవలో తరిస్తున్న వెంకట్రావు సతీమణి కొమ్మోజు వీర నాగ కుమారి నేడు సర్పంచ్ అభ్యర్థిగా ప్రజాక్షేత్రంలోకి అడుగుపెట్టారు.
​"పదవి కోసం మేము రాలేదు.. మమ్మల్ని కన్నబిడ్డల్లా ఆదరించిన ఊరి ప్రజల కోరిక మేరకే బరిలో నిలిచాము. అన్న రంగారావు గారి ఆశయాలను నెరవేరుస్తూ, వేమగిరిని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే మా లక్ష్యం. ప్రజా న్యాయస్థానంలో ప్రజలిచ్చే తీర్పు కోసం వినయంతో వేచి చూస్తున్నాము" అంటూ వెంకట్రావు, వీర నాగ కుమారి దంపతులు ప్రజల ఆశీస్సులు కోరుతున్నారు.