14 వ వార్డు గాంధీనగర్ లో గెడ్డ ఆక్రమణ
- చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్న సచివాలయం సెక్రెటరీ
- ఆక్రమణ పై మండిపడుతున్న కార్పొరేటర్ కాకి గంగరాజు
ఆరిలోవ, నవంబర్ 27, మేజర్ న్యూస్ : జీవీఎంసీ, 14 వ వార్డు పరిధిలో గల గాంధీనగర్ కల్వర్టర్ బ్రిడ్జి పక్కన, సచివాలయం సమీపంలో ప్రభుత్వ గెడ్డను
ఆనుకొని ఉన్న సుమారు 50 గజాల స్థలాన్ని ఓ కూటమి బిజెపి నాయకుడు అండతో రాజు అనే వ్యక్తి ఆక్రమించి ఇల్లు నిర్మించేందుకు పిల్లర్స్ వేసి నిర్మాణం చేపట్టడానికి సిద్ధమవుతున్నారు. గత ప్రభుత్వంలో ఆక్రమణ కు ప్రయత్నిస్తే జీవీఎంసీ అధికారులు చుట్టూ మొక్కలు వేసి ఆ స్థలాన్ని కాపాడారు. అప్పట్లో ఈ స్థలం పక్క నున్న ఇళ్ల స్థలం 60 గజాలు ఉంటే చుట్టుపక్కల ప్రభుత్వ స్థలాన్ని కలిపి వంద గజాల వరకు చేసి ఇల్లు నిర్మించుకున్నాడు. ఇంకా చాలక అదే వ్యక్తి గెడ్డను కూడా వదలకుండా ఆక్రమిస్తున్నాడు . గెడ్డ ఆక్రమణ స్థలం విలువ కనీసం పది లక్షల వరకు ఉండవచ్చని స్థానికులు చెబుతున్నారు . నిర్మాణం చేపట్టకుండా స్థానికులు అడ్డుపడుతున్న కూటమి బలం చూసుకుని రెచ్చిపోతున్నారు. కూటమి ప్రభుత్వం గెడ్డలను ఆక్రమించమని చెప్పిందో ఏమో గాని కూటమి నాయకులు అదే పనిలో ఉన్నారు. కొత్తగా కార్పొరేటర్లు ప్రమాణ స్వీకారం జరిగి వారం రోజులు కాకముందే ఇలాంటి ఆక్రమణలు మొదలయ్యాయని స్థానికులు వాపోయారు. గెడ్డ ఆక్రమించడం వలన ప్రమాదకరమైన తుఫాన్లు వస్తే అక్కడ ఉన్న వాళ్ళ పరిస్థితి ఏమిటి? గెడ్డ ఆక్రమణ పై జీవీఎంసీ అధికారులు తగు చర్యలు చేపట్టాలని, అదేవిధంగా నిర్మించిన పిల్లర్స్ ను తొలగించి అధికారులు ఆ స్థలంలో బోర్డు పెట్టి స్వాధీనం చేసుకోవాలని పలువురు కోరుతున్నారు.... దీనిపై 14 వ వార్డు కార్పొరేటర్ కాకి గంగరాజు వివరణ కోరగా .... నాకు దీనిపై ఎటువంటి సంబంధం లేదని అక్కడ నిర్మాణం జరుగుతున్నట్లు గాని, నాకు తెలి యదని, ప్రజల సమస్యలపై నేనెప్పుడూ వెనువంటే ఉంటానని ఇలాంటి ఆక్రమాలకు తోవఇవ్వనని అన్నారు. కార్పొరేటర్ గా బాధ్యతలు స్వీకరించిన తరుణంలో వార్డును పర్వేక్షిస్తున్నానని ఈ గెడ్డ ఆక్రమణ పై స్థానికులు నాకు సమాచారం అందించారని నేను దీన్ని పరిశీలించి జీవీఎంసీ కమిషనర్ దృష్టికి తీసుకు వెళ్లి నిర్మాణం జరగకుండా ఆపివేస్తానని వివరణ ఇచ్చారు. వార్డుకు సంబంధించి ఎటువంటి స్థల ఆక్రమణలు గాని, అక్రమ అదనపు అంతస్తుల నిర్మాణాలు జరిగితే వార్డు కార్పొరేటర్ గా ఉపేక్షించేది లేదని మండిపడ్డారు. వార్డులో జీవీఎంసీ అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టడం వల్ల వార్డు అభివృద్ధి దిశగా ముందుకు వెళ్లడానికి ఇబ్బందులుగా మారుతాయని స్థానిక ప్రజలు అర్థం చేసుకుని నిర్మాణాలు చేపట్టే ముందు పట్టణ ప్రణాళిక నిబంధనల అనుమతులు తీసుకొని జీవీఎంసీ కి ఆదాయాన్ని చేకూరే విధంగా సహాయపడాలని కోరారు.