పంచాయతీ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ
పాలకొండ, మేజర్ న్యూస్ వీరఘట్టం మండలంలో పంచాయతీ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా పాలకొండ నియోజకవర్గ శాసనసభ్యులు నిమ్మక జయకృష్ణ వివిధ గ్రామాల్లో పర్యటించి కూటమి అభ్యర్థుల ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మండలం లో చిదిమ గ్రామం – బౌరోతు శకుంతల, దసుమంతపురం గ్రామం – ఆలుబిల్లి కుమారస్వామి, కెల్ల, కెడకెల్ల గ్రామాలు – గుంట్రెడ్డి రామకృష్ణ మరియు ముద్దా వెంకటరమణ, విక్రంపురం గ్రామం – మాచర్ల సరోజనమ్మ , హుస్సేన్‌పురం గ్రామం – వారాడ శిరీష తరపున ఆయన ప్రచారం నిర్వహించారు. తమ అమూల్యమైన ఓటు కూటమి అభ్యర్థులుపై వేసి గెలిపించాలని ఆయన కోరారు.ఈ పర్యటనలో తోటపల్లి ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ పొదిలాపు కృష్ణమూర్తి నాయుడు గారు, జడ్పీటీసీ ఉదయాన ఉదయ్ భాస్కర్ రావు గారు మరియు స్థానిక నాయకులు, కూటమి ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.