BREAKING
కోల్ ఇండియా స్థాయి క్రీడా పోటీలను ఘనంగా నిర్వహించాలి బంగారం కోసం వృద్ధురాలి హత్య కేసు... -- ముగ్గురు నిందితులకు జీవిత ఖైదు ఆపదలో ఉన్న కుటుంబానికి అండగా మంత్రి శ్రీధర్ బాబు సర్పంచ్ అభ్యర్థులతో పోలీసుల ఎన్నికల అవగాహన సమావేశం ఇంటింటికీ మెరుగైన వైద్యం అందేలా పనిచేయాలి గొట్టిపల్లి సర్పంచ్‌గా అవ్వ తేజేశ్వరి ఏకగ్రీవ ఎన్నిక.. గత ప్రభుత్వ హయాంలోనే హుజురాబాద్ అభివృద్ధి -- ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పూర్ణిమకు మద్దతుగా మహిళల భారీ ర్యాలీ రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు కోటబొమ్మాళి విద్యార్థిని ఎంపిక ఆర్థిక సహాయం...... మేజర్ పంచాయతీ పోరు రసవత్తరం.. భూ వివాదాలకు తావులేని గ్రామాలే లక్ష్యం. తెలంగాణ ఉద్యమ చరిత్రను వక్రీకరించే ప్రయత్నాలను తిప్పికొట్టాలి 14-15 ఏళ్ల బాలికలకు ఉచిత హెచ్పివి వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహణ గిజబ సర్పంచ్‌గా బాధ్యతలు చేపట్టిన మరడాన ఉషారాణి

ఎల్‌నినో ముప్పుపై రామగుండం అప్రమత్తం!

Select Suryaa Now
ఎల్‌నినో ముప్పుపై రామగుండం అప్రమత్తం!
సూర్య-గోదావరిఖని: ఎల్‌నినో ప్రభావంతో రాబోయే వేసవిలో తలెత్తే కరువు పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు రామగుండం నగరపాలక సంస్థ పటిష్టమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తోందని నగర మేయర్ మహంకాళి స్వామి వెల్లడించారు. నీటి సంరక్షణ, భూగర్భ జలాల పెంపు, పెరుగుతున్న ఉష్ణోగ్రతల నియంత్రణ, పచ్చదనం అభివృద్ధి లక్ష్యంగా తక్షణ, దీర్ఘకాలిక చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.
తెలంగాణ క్లైమేట్ కాంక్లేవ్-2026 కర్టెన్ రైజర్ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం హైదరాబాద్‌లోని ఐటీసీ కాకతీయ హోటల్‌లో నిర్వహించిన ప్రత్యేక వర్క్‌షాప్‌లో మేయర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎల్‌నినో ప్రభావంతో రామగుండం ఎదుర్కొనే వాతావరణ సవాళ్లు, వాటిని అధిగమించేందుకు నగరపాలక సంస్థ చేపట్టనున్న కార్యాచరణను వివరించారు.
తక్షణ చర్యల్లో భాగంగా 'జల్ సంచయ్ జన భాగీదారి' పథకం కింద ఇంటింటా ఇంకుడు గుంతల నిర్మాణాన్ని ప్రోత్సహించి భూగర్భ జలాలను పెంపొందించనున్నట్లు తెలిపారు. తాగునీటి వృథాను అరికట్టేందుకు యుద్ధప్రాతిపదికన పైప్‌లైన్ లీకేజీలను మరమ్మతు చేయించడంతో పాటు ప్రతి నల్లా కనెక్షన్‌కు ఆన్‌-ఆఫ్ వాల్వ్ ఏర్పాటు చేసుకునేలా ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నామని పేర్కొన్నారు.
దీర్ఘకాలిక ప్రణాళికలో భాగంగా నగర తాగునీటి అవసరాలను తీర్చేందుకు ఎనిమిది ఎకరాల విస్తీర్ణంలో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నిర్మాణానికి ప్రణాళిక రూపొందించినట్లు వెల్లడించారు. ప్రస్తుతం నగరంలో 13 ఉపరితల జలాశయాలు ఉండగా, మరో ఎనిమిది జలాశయాలు నిర్మాణ దశలో ఉన్నాయని వివరించారు.
ఎల్‌నినో నేపథ్యంలో రాబోయే వేసవిలో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉన్నందున విద్యుత్ వినియోగ భారాన్ని తగ్గించేందుకు కూల్ రూఫ్ పాలసీపై ప్రజలకు అవగాహన కల్పిస్తామని తెలిపారు. భవనాల పైకప్పుల ద్వారా పెరిగే వేడి ప్రభావాన్ని తగ్గించే చర్యలను ప్రోత్సహిస్తామన్నారు.
సింగరేణి బొగ్గు గనులు, థర్మల్ విద్యుత్ కేంద్రాలు, ఎరువుల కర్మాగారాలతో రాష్ట్ర పారిశ్రామిక ప్రగతికి వెన్నెముకగా నిలుస్తున్న రామగుండం తీవ్రమైన వాతావరణ సవాళ్లను ఎదుర్కొంటోందని మేయర్ పేర్కొన్నారు. భారీ పారిశ్రామిక కార్యకలాపాల కారణంగా ఉష్ణోగ్రతల తీవ్రత మరింత పెరుగుతోందని, హీట్ ప్రివెన్షన్ పాలసీ అమలులో భాగంగా అర్బన్ ఫారెస్ట్రీని అభివృద్ధి చేసేందుకు స్థానిక పరిశ్రమలు సహకరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
అలాగే సోలార్ విద్యుత్ వినియోగం, కాలుష్యరహిత ఎలక్ట్రిక్ ప్రజా రవాణా, హరిత మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో రామగుండం నగరానికి ప్రత్యేక హరిత పెట్టుబడులు వచ్చేలా 'ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026' ద్వారా కృషి చేయాలని కోరినట్లు తెలిపారు.
ఈ వర్క్‌షాప్‌లో నీటి భద్రత, నగర వాతావరణ సవాళ్లు, ప్రజారోగ్యం, జీవవైవిధ్యం, అడవుల పునరుద్ధరణ, వాతావరణానుకూల వ్యవసాయం, జీవనోపాధులు, పునరుత్పాదక ఇంధన వినియోగం, సర్క్యులర్ ఎకానమీ తదితర అంశాలపై చర్చించినట్లు మేయర్ వివరించారు.
ఈ కార్యక్రమంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేష్ రంజన్, పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి, సీడీఎంఏ టి.కె.శ్రీదేవి, వాతావరణ శాఖ డైరెక్టర్ స్టెల్లా, అటవీశాఖ డైరెక్టర్ వినయ్ కుమార్, వ్యవసాయ శాఖ డైరెక్టర్ రామాంజనేయులు, పద్మశ్రీ అవార్డు గ్రహీత చింతల వెంకటరెడ్డి, మంచిర్యాల మేయర్ ధరణి మధుకర్, మహబూబ్‌నగర్ మేయర్ గుమ్మళ్ల మమత, నల్గొండ మేయర్ బుర్రి చైతన్య తదితరులు పాల్గొన్నారు.
---------