BREAKING
కోల్ ఇండియా స్థాయి క్రీడా పోటీలను ఘనంగా నిర్వహించాలి బంగారం కోసం వృద్ధురాలి హత్య కేసు... -- ముగ్గురు నిందితులకు జీవిత ఖైదు ఆపదలో ఉన్న కుటుంబానికి అండగా మంత్రి శ్రీధర్ బాబు సర్పంచ్ అభ్యర్థులతో పోలీసుల ఎన్నికల అవగాహన సమావేశం ఇంటింటికీ మెరుగైన వైద్యం అందేలా పనిచేయాలి గొట్టిపల్లి సర్పంచ్‌గా అవ్వ తేజేశ్వరి ఏకగ్రీవ ఎన్నిక.. గత ప్రభుత్వ హయాంలోనే హుజురాబాద్ అభివృద్ధి -- ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పూర్ణిమకు మద్దతుగా మహిళల భారీ ర్యాలీ రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు కోటబొమ్మాళి విద్యార్థిని ఎంపిక ఆర్థిక సహాయం...... మేజర్ పంచాయతీ పోరు రసవత్తరం.. భూ వివాదాలకు తావులేని గ్రామాలే లక్ష్యం. తెలంగాణ ఉద్యమ చరిత్రను వక్రీకరించే ప్రయత్నాలను తిప్పికొట్టాలి 14-15 ఏళ్ల బాలికలకు ఉచిత హెచ్పివి వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహణ గిజబ సర్పంచ్‌గా బాధ్యతలు చేపట్టిన మరడాన ఉషారాణి

నా గెలుపు మరుపెంట పంచాయతీ ప్రజలకే అంకితం!

Select Suryaa Now
నా గెలుపు మరుపెంట పంచాయతీ ప్రజలకే అంకితం!

గరుగుబిల్లి, నవంబర్ 27, మేజర్ న్యూస్:గరుగుబిల్లి మండలం మరుపెంట గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నూతన సర్పంచ్‌గా ఘన విజయం సాధించిన ఉడమల పార్వతమ్మ తన గెలుపును గ్రామ ప్రజలకే అంకితం చేస్తున్నట్లు శుక్రవారం ప్రకటించారు.ఈవిజయం తన ఒక్కరిది కాదని, మరుపెంట పంచాయతీ ప్రజలందరిదని, ఈగెలుపును వారికే అంకితం చేస్తున్నానని నూతన సర్పంచ్ పార్వతమ్మ భావోద్వేగంతో పేర్కొన్నారు.ఎన్నికల ఫలితాల అనం తరం గ్రామంలో నిర్వహించిన విజయో త్సవ సంబరాల్లో నూతన సర్పంచ్ ఉడమల పార్వతమ్మ పాల్గొని ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.మరుపెంట గ్రామంలో ప్రారంభమైన నూతన సర్పంచ్ ఉడమల పార్వతమ్మ విజయోత్సవ ర్యాలీ సాంబన్నవలస తదితర గ్రామాలలో ఘనంగా నిర్వహిం చారు.ప్రజలు తమపై ఉంచిన నమ్మ కాన్ని నిలబెట్టుకుంటూ, రానున్న రోజుల్లో మరుపెంట గ్రామాన్ని అన్ని రంగాల్లో ఆదర్శవంతంగా తీర్చిదిద్దు తామని హామీ ఇచ్చారు.ఈసందర్భం గా నూతన సర్పంచ్ ఉడమల పార్వతమ్మ మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఘన విజయాన్ని అందిం చిన మరుపెంట గ్రామ ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియ జేశారు.రాజకీయాలకు అతీతంగా గ్రామ పంచాయతీని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపిస్తానని ఈ సందర్భంగా సర్పంచ్ ఉడమల పార్వతమ్మ హామీ ఇచ్చారు.గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పన, తాగునీరు, పారిశుధ్యం మరియు ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా కృషి చేస్తానని స్పష్టం చేశారు.నూతన సర్పంచ్‌గా ఎన్నికైన ఉడమల పార్వతమ్మకు  గ్రామ పెద్దలు, యువత, మహిళలు మరియు నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి ఘనంగా సన్మానిం చారు.గ్రామంలో బాణసంచా కాల్చి, మిఠాయిలు పంచుకుని తమ ఆనందా న్ని వ్యక్తం చేశారు.తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఉడమల సత్యనారాయణ మాట్లాడుతూ గ్రామ పంచాయతీ అభివృద్ధిని కాంక్షించి ప్రజలు ఇచ్చిన ఈ తీర్పు చారిత్రాత్మక మని అన్నారు.ఈకార్యక్రమంలో సీని యర్ తెలుగుదేశం పార్టీ నాయకులు కండేన బలరామునాయుడు, అక్కేన శ్రీరాములునాయుడు,అక్కేన రామ కృష్ణ, అక్కేన నారాయణరావు,గండి స్వామినాయుడు,నగిరెడ్డి పోలి నాయుడు తదితరులు పాల్గొన్నారు.