BREAKING
మూడు నెలలుగా తాగునీటి సరఫరా బంద్-20వ వార్డు ప్రజల అవస్థలు! వికసిత్ భారత్ నిర్మాణంలో విశ్వ విద్యాలయాలు కీలక పాత్ర పోషించాలి-రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల మృతుని కుటుంబానికి అండగా నిలిచిన కౌన్సిలర్ బెజ్జంకి పూర్ణ చారి అంబాల- పరకాల బస్సు ప్రయాణం దుమ్ము ధూళితో నరకం స్పెషల్ క్యాంపెయిన్ డే కార్యక్రమాన్ని పరిశీలించిన పరకాల ఆర్డివో *ఘనంగా ముగిసిన మాదిగల వన సమారాధన* అమెరికా మార్కెట్ల పతనాన్ని అవకాశంగా మార్చుకుంటున్న భారతీయ ఇన్వెస్టర్లు.. ఉద్యోగుల నియామకాలు పెంచకుండానే భారత ఐటీ రంగం వృద్ధి.. ఉద్యోగాలపై నాస్కామ్ కీలక విశ్లేషణ! అధిక ప్యాసింజర్లతో వెళ్లే ఆటోలపై రవాణా శాఖ అధికారుల ప్రత్యేక అవగాహన కార్యక్రమం ఆంత్రోపిక్ ఐపీఓకు గంటల్లోనే లక్ష మందికి పైగా గ్రో యూజర్ల ఆసక్తి.. ఆ స్పందనతో ప్రణాళికలు మార్చుకున్న సంస్థ! ఆంత్రోపిక్ ఐపీఓకు గంటల్లోనే లక్ష మందికి పైగా గ్రో యూజర్ల ఆసక్తి.. ఆ స్పందనతో ప్రణాళికలు మార్చుకున్న సంస్థ! ధాన్యం కొనుగోళ్లపై జిల్లా కలెక్టర్ సమీక్ష వీధి కుక్కల నుండి ప్రజలను కాపాడాలి... జిల్లా కలెక్టర్ఆశీష్ సంఘ్వాన్ ఎస్‌బీఐ చిన్న, మధ్యతరహా వ్యాపార రుణ పరిమితి పెంపు.. ఎంఎస్‌ఎంఈ రంగానికి భారీ ఊతం! నేడు మండలానికి రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారులు రాక

జంగులూరు వెలంపాలెం పంచాయతీలో హోరెత్తిన కూటమి ప్రచార జోరు!

Select Suryaa Now
జంగులూరు వెలంపాలెం పంచాయతీలో హోరెత్తిన కూటమి ప్రచార జోరు!

విజయోత్సవాన్ని తలపించిన 'వజ్రపు కృష్ణకుమారి' ఇంటింటి ప్రచారం!

ఎస్.రాయవరం, నవంబర్ 27, మేజర్ న్యూస్: జంగులూరు వెలంపాలెం గ్రామ పంచాయతీ కూటమి బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి వజ్రపు కృష్ణకుమారి ఎన్నికల ప్రచార కార్యక్రమం ఏదో మామూలు ప్రచారంలా కాదు... సాక్షాత్తు విజయోత్సవ సంబరంలా సాగింది.శుక్రవారం నిర్వహించిన ఇంటింటి ప్రచారంలో గ్రామంలోని ప్రతి వీధి పసుపు జెండాలతో, కూటమి నినాదాలతో మారుమ్రోగింది. అభ్యర్థి గుర్తులు పట్టుకుని, పార్టీ జెండాలు చేతబట్టి కార్యకర్తలు ఉత్సాహంగా కదం తొక్కారు.ఈ సందర్భంగా అభ్యర్థి భర్త, తాజా ఎంపీటీసీ సభ్యులు వజ్రపు శంకరరావు మైక్ అందుకుని ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. "మన కూటమి సర్పంచ్ అభ్యర్థి వజ్రపు కృష్ణకుమారిని దీవించి, అత్యధిక మెజారిటీతో గెలిపించండి. గ్రామ అభివృద్ధే మా లక్ష్యం" అని అభ్యర్థించారు.ఆయన పిలుపునకు స్పందన అదిరిపోయింది. ఇంటిల్లపాది కుటుంబ సమేతంగా 'వజ్రపు' వారి వెంట మేము సైతం మీ ప్రచారంలో అన్నట్టుగా వందలాది మంది గ్రామస్తులు స్వచ్ఛందంగా కదిలివచ్చి ప్రచార సంబరంలో కలిసికట్టుగా పాల్గొన్నారు. ఆడబిడ్డలు, యువత, పెద్దలు అంతా కలిసి ఈ ప్రచారాన్ని ఒక పండుగలా మార్చేశారు.కూటమి పట్ల ప్రజల్లో ఉన్న ఆదరణ, వజ్రపు కుటుంబం పట్ల ఉన్న నమ్మకం ఈ ప్రచార ర్యాలీలో స్పష్టంగా కనిపించింది. ఫలితం ముందే తేలిపోయినట్టుగా సాగిన ఈ ప్రచార హోరు, ప్రత్యర్థులకు గట్టి సంకేతం ఇచ్చిందని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. ప్రచారం అనంతరం గ్రామంలో వజ్రపు కృష్ణకుమారి విజయం ఖాయమంటూ కార్యకర్తలు ధీమా వ్యక్తం చేశారు.