telangana
అలయ్ బలయ్ గోడ ప్రతి ఆవిష్కరణ.
సూర్య రామడుగు ;;.కరీంనగర్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం నందు సీనియర్ దళిత నాయకులు గజ్జల ఆనందరావు కలవల రామచంద్రం గోడ ప్రతి ఆవిష్కరణ చేశారు.నవంబర్ 29 న హైదరాబాదులో మాదిగ మాదిగ ఉపకులాల అలయ్-బలయ్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఈకార్యక్రమంలో ముఖ్య అతిథిగా బార్ అసోసియేషన్ మాజీ ప్రెసిడెంట్ రఘువీర్ ప్రస్తుత బార్ అసోసియేషన్ సభ్యులు బెజ్జంకి శ్రీనివాస్, దళిత సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకుడు కనకం వంశీ, దళిత సంక్షేమ సంఘం జిల్లా నాయకుడు తాండ్ర భూమేష్ పాల్గొన్నారు. పిడమర్తి రవి నాయకత్వంలో ఇట్టి కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్రం మాదిగ ఉపకులాల మంత్రులు శాసనసభ సభ్యులు హాజరవుతారు. కావున కరీంనగర్ జిల్లాలోని మాదిగ మాదిగ ఉపకులాల దళిత నాయకులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.