telangana
ఎస్ జి ఎఫ్ రాష్ట్రస్థాయి టేబుల్ టెన్నిస్ పోటీలకు ఎంపికైన అల్ఫోర్స్ విద్యార్థులు.
సూర్య రామడుగు ;;;రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామంలోని అల్ఫోర్స్ పాఠశాలకు చెందిన విద్యార్థులు సెప్టెంబర్ నెలలో పెద్దపెల్లి జిల్లాలో స్కూల్ గేమ్స్ ఆఫ్ ఫెడరేషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉమ్మడి జిల్లా స్థాయి టేబుల్ టెన్నిస్ పోటీలలో ఆల్ ఫోర్స్ పాఠశాలకు చెందిన A శాన్విక 9వ తరగతి ,అండర్ 14 విభాగంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ప్రథమ స్థానంతో పాటు బంగారు పతకం సాధించింది. Y హన్సిక 9వ తరగతికి చెందిన విద్యార్థి అండర్ 17 విభాగంలో రాణించి ద్వితీయ స్థానంతో పాటు వెండి పథకం సాధించింది . నవంబర్ నెలలో 29 వ తేదీన పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోనిర్వహించబోయే రాష్ట్ర స్థాయి టేబుల్ టెన్నిస్ పోటీలకు ఎంపికవ్వడం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాలలో
అభినందన కార్యక్రమం ఏర్పాటు చేశారు ముఖ్య అతిథిగా విద్యాసంస్థల అదినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డి హాజరై విద్యార్థులను అభినందించారు వారు మాట్లాడుతూ చదువుతోపాటు ఆటల్లో పాల్గొనడం వల్ల శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉంటారని పేర్కొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థిని,విద్యార్థులు పాల్గొనడం జరిగింది.