BREAKING
ఇంటింటికీ మెరుగైన వైద్యం అందేలా పనిచేయాలి గొట్టిపల్లి సర్పంచ్‌గా అవ్వ తేజేశ్వరి ఏకగ్రీవ ఎన్నిక.. గత ప్రభుత్వ హయాంలోనే హుజురాబాద్ అభివృద్ధి -- ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పూర్ణిమకు మద్దతుగా మహిళల భారీ ర్యాలీ రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు కోటబొమ్మాళి విద్యార్థిని ఎంపిక ఆర్థిక సహాయం...... మేజర్ పంచాయతీ పోరు రసవత్తరం.. భూ వివాదాలకు తావులేని గ్రామాలే లక్ష్యం. తెలంగాణ ఉద్యమ చరిత్రను వక్రీకరించే ప్రయత్నాలను తిప్పికొట్టాలి 14-15 ఏళ్ల బాలికలకు ఉచిత హెచ్పివి వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహణ గిజబ సర్పంచ్‌గా బాధ్యతలు చేపట్టిన మరడాన ఉషారాణి దీక్ష దివాస్ ను విజయవంతం చేయాలి వెంకటాపురం గ్రామ సర్పంచ్ బుధిత్ బుడితీ రమణమ్మ.గౌరీ నాయుడులను అభినందించిన మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు గాదిరాయి పంచాయతీ టిడిపి ఏకగ్రీవం.. సర్పంచ్‌గా పెంటకోట భవాని టొబాకో ఫ్రీ యూత్ క్యాంపెయిన్

111 కోర్సులకు గీతం ప్రవేశ పరీక్ష గ్యాట్`2027

Select Suryaa Now
 111 కోర్సులకు గీతం ప్రవేశ పరీక్ష గ్యాట్`2027

విశాఖ ఎడ్యుకేషన్, నవంబర్ 27 మేజర్ న్యూస్ :      గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం  ద్వారా విశాఖపట్నం, హైదరాబాద్, బెంగళూరు ప్రాంగణాలలో  నిర్వహిస్తున్న  ఇంజనీరింగ్, సైన్స్, ఫార్మశీ, పారామెడికల్, ఆర్కిటెక్చర్, లా, మేనేజ్‌మెంట్, హ్యూమానిటీస్ మరియు సోషల్ సైన్సెస్, విభాగాలకు చెందిన 111 యుజి, పిజీ కోర్సులలో ప్రవేశాలకు జాతీయ స్థాయి ప్రవేశ పరీక్ష  గీతం అడ్మిషన్ టెస్ట్ (గ్యాట్`2027) వచ్చే ఏడాది మార్చి 27వ తేదీన  నిర్వహించనున్నట్లు  గీతం ప్రో-వైస్ ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ వై.గౌతమ్‌రావు  తెలిపారు.  శుక్రవారం  విశాఖ లో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన ప్రవేశ పరీక్ష విధానం, కోర్సులు, విద్యార్ధులకు అందిస్తున్న స్కాలర్‌షిప్‌ల వివరాలను వెల్లడించారు.
      గీతం విశాఖపట్నం, హైదరాబాద్, బెంగళూరు ప్రాంగణాలలోని బిజినెస్ స్కూల్స్‌లో ఎంబిఎ ప్రవేశానికి గీతం బిజినెస్ అడ్మిషన్ టెస్ట్ (జిబాట్`2027) ప్రత్యేకంగా నిర్వహిస్తామని తెలిపారు. క్యాట్ వంటి జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలలో ప్రతిభ కనబరిచిన వారికి జిబాట్ నుంచి మినహయింపు ఉంటుందని వారికి నేరుగా ఎంబిఎ కోర్సులలో ప్రవేశం కల్పిస్తామన్నారు. 
      గీతం హైదరాబాద్ ప్రాంగణంలో 4 సంవత్సరాల బిఇడి కోర్సులు:
   గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం హైదరాబాద్ ప్రాంగణంలో స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ద్వారా 4 సంవత్సరాల బిఎ .బిఇడి మరియు బిఎస్సీ .బిఇడి  కోర్సులను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇంటర్మిడియట్ అర్హత గల వారికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ జాతీయ స్థాయిలో నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష (ఎన్.సి.ఇ.టి) ద్వారా ఈ బిఇడి కోర్సులలో ప్రవేశాలు కల్పిస్తామన్నారు.
       గీతంలో  ప్రవేశాలు గీతం అడ్మిషన్ టెస్ట్`2027 (గాట్`2027) లో విద్యార్ధులు సాధించిన ప్రతిభ ఆధారంగా  ఉంటాయని, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలు నిర్వహించే ప్రవేశ పరీక్షలలో ఉత్తమ ర్యాంకులు సాధించిన వారు,  జేఈఈ, సియుఈటి వంటి గుర్తింపు పొందిన జాతీయ  ప్రవేశ పరీక్షల్లో ఉత్తమ స్కోర్లు సాధించిన అభ్యర్ధులకు గ్యాట్ పరీక్ష నుండి మినహయింపు ఉంటుందని తెలిపారు. పైన తెలిపిన ప్రవేశ పరీక్షలలో విద్యార్ధులు కనబరిచిన ప్రతిభ ఆధారంగా గీతం అండర్ గ్రాడ్యుయేట్(యుజి) మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్ (పిజి) కోర్సుల ట్యూషన్ ఫీజుపై మెరిట్ ఆధారిత స్కాలర్‌షిప్‌లను అందిస్తున్నామన్నారు.  దీనితో పాటు  క్రీడా స్కాలర్‌షిప్‌లు, భారత నౌకాదళం (ఇండియన్ నేవీ), సిఆర్‌పిఎఫ్ మరియు భారత వైమానిక దళం (ఇండియన్ ఎయిర్‌ఫోర్స్) సిబ్బంది మరియు ఇండియన్ ఆర్మి  వారి కుటుంబాల సేవలను గుర్తిస్తూ పబ్లిక్ సర్వీస్ స్కాలర్‌షిప్‌లు అందిస్తున్నామని వెల్లడించారు. 
    వెనకబడి వర్గాల వారికి పాత్‌వే స్కాలర్‌షిప్‌లు 
       ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే సాంఘిక సంక్షేమ విద్యాలయాలలో చదువుతున్న వారిలో ప్రతిభను గుర్తించేందుకు గీతం విశ్వవిద్యాలయం  పాత్‌వే స్కాలర్‌షిప్‌లను అందిస్తోందని తెలిపారు. ప్రత్యేక ప్రవేశ పరీక్ష ద్వారా విద్యార్ధులను గుర్తించి వారికి ఉచిత విద్య, భోజన సధుపాయాలు  అందిస్తున్నామని వెల్లడించారు. 
       గీతం విశ్వవిద్యాలయం న్యాక్ ఏ++ గ్రేడ్‌తో పాటు విశ్వవిద్యాలయం అందిస్తున్న ఇంజనీరింగ్,  ఫార్మశీ మరియు మేనేజ్‌మెంట్ కోర్సులకు ప్రతిష్టాత్మకమైన ఎన్‌బిఎ గుర్తింపును  లభించిందని, ఇది విశ్వవిద్యాలయం  ఉన్నత విద్యా ప్రమాణాలకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.  విద్యార్ధుల ఆలోచనా దృక్పధాన్ని పెంపొందించడానికి మరియు వారి కెరీర్ అవకాశాలను విస్తృతం చేయడానికి  క్యాంపస్‌లలో లిబరల్ ఎడ్యుకేషన పాఠ్యప్రణాళికను విజయవంతంగా అమలు చేస్తున్నామని, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా  కోర్సులను నిర్వహిస్తున్నామని ఆయన  తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక క్యాంటమ్ టీచింగ్ ప్రయోగశాలను అలాగే 5జి రీసెర్చి ల్యాబ్‌లను గీతంలో ఏర్పాటు చేసిందని  ఆయన వెల్లడించారు. 
       ఆసక్తి గల విద్యార్ధులు మరియు తల్లిదండ్రులు ధకఖాస్తు విధానం, అర్హత ప్రమాణాలు పరీక్షా కేంద్రాలు పూర్తి వివరాల కోసం గీతం వెబ్‌సైట్ ను ఆన్‌లైన్ ధరఖాస్తూ చేసుకోవాలని సూచించారు.  సమావేశంలో జిమ్‌సర్ ప్రో`విసి డాక్టర్ బి.గీతాంజలి, గీతం రిజిస్ట్రార్ ప్రొఫెసర్ డి.గుణశేఖరన్, గీతం అడ్మిషన్ డైరక్టర్ ఎమ్.జగధీష్ వివిధ కళాశాలల డీన్స్ మరియు డైరక్టర్‌లు తదితరులు పాల్గొన్నారు.