BREAKING
నర్సీపట్నంలో నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ భవనానికి శంకుస్థాపన పంచాయతీ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ గుమ్మిడి దంపతులకు నీలమ్మ కాలనీ సచివాలయ ఉద్యోగులు సత్కారం అలయ్ బలయ్ గోడ ప్రతి ఆవిష్కరణ. ఎస్సీ కమిషన్ సభ్యులను కలిసిన సర్పంచ్ రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి – జిల్లా కలెక్టర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మున్సిపల్ చైర్ పర్సన్ చింతకాయల పద్మావతి ఆకస్మిక తనిఖీ చొప్పదండి నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత డాక్టర్ మేడిపల్లి సత్యం. జడ్పీ చైర్‌పర్సన్ మజ్జి సిరి సహస్త్రను మర్యాదపూర్వకంగా కలిసిన గుమ్మడి సింహాద్రి. నా గెలుపు మరుపెంట పంచాయతీ ప్రజలకే అంకితం! ఎల్‌నినో ముప్పుపై రామగుండం అప్రమత్తం! బాల్య వివాహాల నిర్మూలనపై విద్యార్థుల ర్యాలీ జంగులూరు వెలంపాలెం పంచాయతీలో హోరెత్తిన కూటమి ప్రచార జోరు! ఎస్ జి ఎఫ్ రాష్ట్రస్థాయి టేబుల్ టెన్నిస్ పోటీలకు ఎంపికైన అల్ఫోర్స్ విద్యార్థులు. మరుపెంట ఉప సర్పంచ్‌గా అక్కేన చిన్నమ్మి ఏకగ్రీవ ఎన్నిక

పోలమాంబ దేవాలయంలో అయ్యప్ప స్వాముల నిత్య అన్నదానం

Select Suryaa Now
పోలమాంబ దేవాలయంలో  అయ్యప్ప స్వాముల నిత్య అన్నదానం

- ముఖ్య అతిథులుగా కార్పొరేటర్లు  14 వ వార్డు కాకి గంగరాజు... 15 వ వార్డు  ఒమ్మి అప్పలరాజు

ఆరిలోవ, నవంబర్ 27, మేజర్ న్యూస్: జీవీఎంసీ, 17వ వార్డు   పరిధిలో గల సంజయ్ గాంధీ కాలనీ  శ్రీ పోలమాంబ అమ్మవారి  ఆలయ ఆవరణలో శ్రీ హరి హర పుత్ర అయ్యప్ప స్వామి శబరి పీఠం  వద్ద  నిత్యా  అన్నదాన  కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. కమిటీ ఆహ్వానం మేరకు ముఖ్య అతిథులుగా  జీవీఎంసీ 14 వ వార్డు కార్పొరేటర్ కాకి గంగరాజు , 15 వ వార్డు కార్పొరేటర్ ఒమ్మి అప్పలరాజు  శుక్రవారం  అయ్యప్ప స్వామి శబరి పీఠాన్ని దర్శించి, అయ్యప్ప స్వాముల నిత్య అన్నదాన కార్యక్రమంలో పాల్గొని స్వాములకు  వారి చేతుల మీదుగా  ప్రసాదాన్ని వడ్డించారు. అనంతరం కార్పొరేటర్లు  కాకి గంగరాజు, ఒమ్మి అప్పలరాజు కు కమిటీ ప్రతినిధులు  శాలువా కప్పి  ఘనంగా  సత్కరించారు. ఈ సందర్భంగా వారు  మాట్లాడుతూ  ప్రతి ఏడాది అయ్యప్ప స్వాములకు  ఉచిత అన్న వితరణ చేయడం  చాలా గొప్ప విషయం అని  కొనియాడారు. ఈ సందర్భంగా  కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న  శ్రీ హరి హర పుత్ర  అయ్యప్ప స్వామి శబరి పీఠం ప్రతినిధులు ఎం. సీతారాం, కోడి బోయిన అప్పలరాజు, బోనీ దిలీప్ కుమార్ ను  అభినందించారు.   వచ్చేనెల  10 వ తేదీ వరకు ప్రతిరోజు నిత్య అన్నదాన కార్యక్రమాన్ని  నిర్వహిస్తామని శ్రీ హరిహర పుత్ర ప్రతినిధులు   తెలిపారు.  స్వామిలందరూ   అన్నదాన ప్రసాదాన్ని స్వీకరించి, తమ వంతు  సహాయ సహకారాలు అందించి,  స్వామి వారి కృపకు పాత్రులు కాగలరని  కోరారు.