మరుపెంట ఉప సర్పంచ్‌గా అక్కేన చిన్నమ్మి ఏకగ్రీవ ఎన్నిక
గరుగుబిల్లి, నవంబర్ 27, మేజర్ న్యూస్:గరుగుబిల్లి మండలం మరుపెంట గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్‌గా అక్కేన చిన్నమ్మి ఏకగ్రీవం గా ఎన్నికయ్యారు.ఈమేరకు మరు పెంట గ్రామ పంచాయతీ కార్యాలయం లో శుక్రవారం గ్రామ పంచాయతీ కార్యదర్శి మరడాన భార్గవ్ కుమార్ ఆధ్వర్యంలో ఎన్నికల అధికారి ఉప సర్పంచ్ ఎన్నిక ప్రక్రియను నిర్వహిం చారు.ఈఎన్నిక ప్రక్రియలో భాగంగా వార్డు సభ్యులందరూ ఏకగ్రీవంగా చిన్నమ్మికి తమ మద్దతు తెలిపారు. గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ పదవికి సంబంధించి మరెవరూ నామినేషన్ దాఖలు చేయకపోవడంతో అక్కేన చిన్నమ్మి ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు ఎన్నికల అధికారి అధికారికంగా ప్రకటించారు.అనంతరం ఉప సర్పంచ్ అక్కేన చిన్నమ్మితో ప్రమాణ స్వీకారం చేయించి, నియామక పత్రాన్ని అంద జేశారు.ఈసందర్భంగా నూతనంగా ఎన్నికైన ఉప సర్పంచ్ అక్కేన చిన్నమ్మి మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఏకగ్రీవంగా ఎన్నుకున్న వార్డు సభ్యుల కు, గ్రామ పెద్దలకు మరియు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.గ్రామ సర్పంచ్ ఉడమల పార్వతమ్మ మరియు అధికా రుల సహకారంతో మరుపెంట గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు, ప్రభుత్వ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.ఉప సర్పంచ్‌గా ఎన్నికైన అక్కేన చిన్నమ్మిని గ్రామ సర్పంచ్ ఉడమల పార్వతమ్మతో పాటు వార్డు సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు మరియు గ్రామస్థులు శాలువలు, పూలమాలలతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.ఈకార్యక్ర మంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఉడమల సత్యనారాయణ,సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు కండేన బలరాంనాయుడు,అక్కేన రామక్రిష్ణ, అక్కేన నారాయణరావు,అక్కేన శ్రీరాములునాయుడు,గండి స్వామి నాయుడు,నగిరెడ్డి పోలినాయుడు తదితరులు పాల్గొన్నారు