వెంకట్రావుపల్లిలో గ్రానైట్ చోరీ.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ఎస్ఐ
సూర్య..బోయినపల్లి మండలం వెంకట్రావుపల్లిలోని శక్తి మార్బుల్స్ అండ్ గ్రానైట్స్ దుకాణంలో చోరీ జరిగింది. నవంబర్ 18న రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు సుమారు రూ.30,000 విలువైన గ్రానైట్ రాళ్లను దొంగిలించారు. యజమాని సుంకపాక శ్రీకాంత్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు బోయినపల్లి ఎస్ఐ ఎన్. రమాకాంత్ తెలిపారు