రాజ్యాంగ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు
రామాయంపేట;భారత రాజ్యాంగం కల్పించిన హక్కులు, సమానత్వం, స్వేచ్ఛా భావాలను ప్రతి ఒక్కరూ గౌరవించాలని, రాజ్యాంగ పరిరక్షణకు ప్రతి పౌరుడు బాధ్యతగా కృషి చేయాలని బీజేపీ నాయకులు పిలుపునిచ్చారు.రామాయంపేట మండల కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ దళిత మోర్చా అధ్యక్షుడు బాలరాజ్, మండల పార్టీ అధ్యక్షుడు నవీన్ గౌడ్, పట్టణ అధ్యక్షుడు అవినాష్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ముందుగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమాన హక్కులు, స్వేచ్ఛ, న్యాయం కల్పించిందని పేర్కొన్నారు. రాజ్యాంగం ద్వారా లభించిన హక్కులపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని సూచించారు. రాజ్యాంగంలోని ఆశయాలు, స్ఫూర్తిని భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. సమాజంలో సమానత్వం, సామాజిక న్యాయం పెంపొందించేందుకు అంబేద్కర్ ఆశయాల సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో వేముల సిద్ధరాములు, సంగయ్య, భాను తదితర బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.