BREAKING
వైసిపి బలపరిచిన రంపచోడవరం సర్పంచ్ గా సంకురు బేబీ కుమారి అఖండ విజయం గ్రామ పంచాయతీ అభివృద్ధే ప్రధాన లక్ష్యం ఎమ్మెల్యే సత్యప్రభను మర్యాదపూర్వకంగా కలిసిన అన్నవరం ఈఓ లక్ష్మీ శివ జ్యోతి రాజ్యాంగాన్ని కాపాడుకుందాం శ్రీపతిరావు పేట లో ప్రచార నిర్వహిస్తున్న సర్పంచ్ అభ్యర్థి చెన్నయ్య రాజ్యాంగంపై యువతకు అవగాహన ఉండాలి ఎస్వీ ఆర్ట్స్ కళాశాలలో రాజ్యాంగ దినోత్సవం -పోటీల విజేతలకు జ్ఞాపికలు, ప్రశంసాపత్రాలు అందజేత అధికారులు ఎన్నికలకు సమాయత్తం కావాలి ప్రత్తిపాడులో బలపడుతున్న వైసీపీ శివలింగాల దర్శనం మహాపాతక నాశనం తిరుపతిలో వైసీపీకి భారీ షాక్.. 3 వేల మందితో టిడిపి లో చేరిన తిరుమల వైసిపి నేత ప్రవీణ్ రాయల్ రేపు ఉదయం 10 గంటలకు ఏపీ కేబినెట్ సమావేశం.. మన ఓటే.. మన భవిష్యత్తు! రాజ్యాంగ విలువలే విద్యార్థులకు మార్గదర్శకం -మహాత్మా గాంధీ మునిసిపల్ పాఠశాలలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవం ఓటింగ్ సరళిని పరిశీలించిన జిల్లా ఎన్నికల అధికారి కాకినాడ నగరపాలక సంస్థ ఎన్నికల బ్యాలెట్ బాక్సుల భద్రతా ఏర్పాట్ల ను పరిశీలించిన జిల్లా స్థానిక సంస్థల సాధారణ పరిశీలకులు లావణ్య వేణి

పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా

Select Suryaa Now
పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా

విజయవాడ, మేజర్‌న్యూస్‌ :

రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా, స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం అన్ని చర్యలు తీసుకుందని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా తెలిపారు.

గురువారం కృష్ణా జిల్లా తాడిగడప మున్సిపాలిటీ పరిధిలోని  రవీంద్ర భారతి స్కూల్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను, అలాగే విజయవాడ రూరల్ మండలం ఎనికేపాడు గ్రామంలోని పోలింగ్ కేంద్రాలను ఆయన సందర్శించి పోలింగ్ సరళిని పరిశీలించారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా రవీంద్ర భారతి, విజ్ఞాన విహార్ స్కూల్స్ లో గురువారం మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా ఈరోజు 23 పట్టణ స్థానిక సంస్థల్లో (మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు) పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుందని తెలిపారు- తాడిగడప మున్సిపాలిటీ పరిధిలోని రవీంద్ర భారతి స్కూల్‌లో ఏర్పాటు చేసిన ఎనిమిది పోలింగ్ స్టేషన్లను పరిశీలించి, ఎన్నికల నిర్వహణ తీరును సమీక్షించినట్లు తెలిపారు. పోలింగ్ కేంద్రాల్లో బూత్ లెవల్ అధికారులు ఓటర్లకు మార్గనిర్దేశం చేస్తున్న తీరును, ఓటర్లకు కల్పించిన సౌకర్యాలను పరిశీలించినట్లు పేర్కొన్నారు. పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, క్రమబద్ధంగా కొనసాగుతోందని, ఇప్పటివరకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాలేదని తెలిపారు.

   పోలింగ్ ఏజెంట్లు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఓటర్లతో మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్నామని, ఎలాంటి సమస్యలు లేదా ఫిర్యాదులు లేవని వారు వెల్లడించినట్లు తెలిపారు. ఓటర్లు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు.

   పోలింగ్ ముగిసే సమయానికి పోలింగ్ కేంద్రాల వద్ద ఓటు వేసేందుకు వేచి ఉన్న ఓటర్లకు నిబంధనల ప్రకారం స్లిప్పులు అందించి, వారందరికీ ఓటు వేసే అవకాశం కల్పిస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల  పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోందని, మధ్యాహ్నం 1 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని తెలిపారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఇప్పటివరకు 40 శాతానికి పైగా పోలింగ్ నమోదైనట్లు వెల్లడించారు.  సర్పంచ్ స్థానాల్లో సుమారు 19 శాతం, వార్డు సభ్యుల స్థానాల్లో సుమారు 30 శాతం ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు వివరించారు.

గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ముగిసిన అనంతరం మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభమవుతుందని, సాధ్యమైనంత వరకు అదే రోజు సాయంత్రంలోగా ఫలితాలు ప్రకటించేలా కలెక్టర్లకు మార్గదర్శకాలు జారీ చేసినట్లు తెలిపారు. గ్రామ పంచాయతీ ఎన్నికల బ్యాలెట్ బాక్సులను పోలీసు భద్రత నడుమ కౌంటింగ్ కేంద్రాలకు తరలించి, కౌంటింగ్ ప్రక్రియ నిర్వహిస్తామని పేర్కొన్నారు.

  మున్సిపల్ ఎన్నికల పోలింగ్ పూర్తయిన అనంతరం బ్యాలెట్ బాక్సులను పటిష్ట భద్రత మధ్య స్ట్రాంగ్ రూమ్‌లకు తరలించి, ఈ నెల 30వ తేదీన కౌంటింగ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఎన్నికల ప్రక్రియకు సంబంధించి అవసరమైన చోట్ల వీడియో గ్రఫీ, సీసీటీవీ నిఘా ఏర్పాటు చేస్తున్నామని, భవిష్యత్తులో ఏవైనా న్యాయపరమైన అభ్యంతరాలు తలెత్తితే ఆధారాలుగా ఉపయోగపడేలా ఫుటేజీ భద్రపరుస్తామని తెలిపారు.

ఎన్నికల నిర్వహణపై జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. ఎక్కడైనా సమస్యలు తలెత్తితే వెంటనే అదనపు పోలీసు బలగాలను పంపించి పరిస్థితిని అదుపులోకి తీసుకురావాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా చూడాలని ఆదేశించినట్లు తెలిపారు.

 ప్రతి ఒక్క ఓటరుకు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునే అవకాశం కల్పించడం ఎన్నికల సంఘం బాధ్యత అని, ఈ విషయంలో అధికారులు పూర్తి అప్రమత్తతతో వ్యవహరించాలని సూచించారు.

ఎన్నికల నిర్వహణలో జిల్లా కలెక్టర్లు, పోలీసు అధికారులు, ఎన్నికల సిబ్బంది సమన్వయంతో పనిచేస్తున్నారని, వారి కృషి అభినందనీయమని ప్రశంసించారు. ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో ఎన్నికల నిర్వహణకు సమర్థవంతంగా ఏర్పాట్లు చేసిన జిల్లా కలెక్టర్స్, పోలీసు అధికారులు, ఇతర శాఖల సిబ్బందికి కమిషనర్ అభినందనలు తెలిపారు.

ఎన్నికలు పూర్తయ్యే వరకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ప్రతి ఓటరుకు ఎలాంటి భయం, ఒత్తిడి లేకుండా ఓటు వేసే అవకాశం కల్పించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా స్పష్టం చేశారు.

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తోపాటు  విజ్ఞాన విహార్ స్కూల్ లో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా జి లక్ష్మీశ, ఆర్డీవో శ్రీనివాస్, రవీంద్ర భారతి స్కూల్ లో ఉయ్యూరు ఆర్డీవో కరుణ కుమారి, తాడిగడప మున్సిపల్ కమిషనర్ నజీర్,తదితరులు ఉన్నారు.