BREAKING
వైసిపి బలపరిచిన రంపచోడవరం సర్పంచ్ గా సంకురు బేబీ కుమారి అఖండ విజయం గ్రామ పంచాయతీ అభివృద్ధే ప్రధాన లక్ష్యం ఎమ్మెల్యే సత్యప్రభను మర్యాదపూర్వకంగా కలిసిన అన్నవరం ఈఓ లక్ష్మీ శివ జ్యోతి రాజ్యాంగాన్ని కాపాడుకుందాం శ్రీపతిరావు పేట లో ప్రచార నిర్వహిస్తున్న సర్పంచ్ అభ్యర్థి చెన్నయ్య రాజ్యాంగంపై యువతకు అవగాహన ఉండాలి ఎస్వీ ఆర్ట్స్ కళాశాలలో రాజ్యాంగ దినోత్సవం -పోటీల విజేతలకు జ్ఞాపికలు, ప్రశంసాపత్రాలు అందజేత అధికారులు ఎన్నికలకు సమాయత్తం కావాలి ప్రత్తిపాడులో బలపడుతున్న వైసీపీ శివలింగాల దర్శనం మహాపాతక నాశనం తిరుపతిలో వైసీపీకి భారీ షాక్.. 3 వేల మందితో టిడిపి లో చేరిన తిరుమల వైసిపి నేత ప్రవీణ్ రాయల్ రేపు ఉదయం 10 గంటలకు ఏపీ కేబినెట్ సమావేశం.. మన ఓటే.. మన భవిష్యత్తు! రాజ్యాంగ విలువలే విద్యార్థులకు మార్గదర్శకం -మహాత్మా గాంధీ మునిసిపల్ పాఠశాలలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవం ఓటింగ్ సరళిని పరిశీలించిన జిల్లా ఎన్నికల అధికారి కాకినాడ నగరపాలక సంస్థ ఎన్నికల బ్యాలెట్ బాక్సుల భద్రతా ఏర్పాట్ల ను పరిశీలించిన జిల్లా స్థానిక సంస్థల సాధారణ పరిశీలకులు లావణ్య వేణి

కార్తీక పౌర్ణమి వేడుకల అనంతరం చెత్తకుప్పగా కీసరగుట్ట.. పట్టించుకునేదెవరు?

Select Suryaa Now
కార్తీక పౌర్ణమి వేడుకల అనంతరం చెత్తకుప్పగా కీసరగుట్ట.. పట్టించుకునేదెవరు?

కీసర, మేజర్ న్యూస్ : తెలంగాణలో ప్రముఖ శైవక్షేత్రంగా పేరొందిన కీసరగుట్ట కార్తీక పౌర్ణమి వేడుకల అనంతరం చెత్తాచెదారంతో అపరిశుభ్రంగా మారడం భక్తులను ఆవేదనకు గురిచేస్తోంది. మంగళవారం కార్తీక పౌర్ణమి సందర్భంగా వేలాది మంది భక్తులు కీసరగుట్టకు తరలివచ్చి శ్రీ భవానీ శివ దుర్గా సమేత రామలింగేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గుట్టపై ఉన్న శివలింగాలకు అభిషేకాలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు.భక్తుల రాకతో సందడిగా మారిన పుణ్యక్షేత్రం.. ఉత్సవాలు ముగిసిన మరుసటి రోజే పలుచోట్ల చెత్తాచెదారంతో దర్శనమివ్వడం విమర్శలకు తావిస్తోంది. భక్తుల రద్దీని ముందుగానే అంచనా వేసినప్పటికీ పారిశుద్ధ్య నిర్వహణపై తగిన శ్రద్ధ చూపలేదని పలువురు భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పవిత్రమైన పుణ్యక్షేత్రంలో ఇలాంటి అపరిశుభ్ర పరిస్థితులు నెలకొనడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఆలయ పరిసరాల పరిశుభ్రతను కాపాడాల్సిన బాధ్యత ఆలయ అధికారులదా? పారిశుద్ధ్య నిర్వహణ చేపట్టాల్సిన మున్సిపల్ అధికారులదా? ఉత్సవాల నిర్వహణలో సంబంధిత శాఖల మధ్య సమన్వయ లోపమే ఇందుకు కారణమా? అంటూ భక్తులు ప్రశ్నిస్తున్నారు. పండుగలు, ఉత్సవాల సమయంలో భక్తుల రాకపోకలపై దృష్టి సారించే అధికారులు, వేడుకలు ముగిసిన తర్వాత పారిశుద్ధ్య నిర్వహణను ఎందుకు విస్మరిస్తున్నారని నిలదీస్తున్నారు.ఇప్పటికైనా ఆలయ ఈఓ, చైర్మన్‌తో పాటు సంబంధిత మున్సిపల్ అధికారులు స్పందించి గుట్టపై పేరుకుపోయిన చెత్తను వెంటనే తొలగించాలని భక్తులు కోరుతున్నారు. ప్రత్యేక ఉత్సవాల సమయంలో అదనపు పారిశుద్ధ్య సిబ్బందిని నియమించడంతో పాటు, ప్రతిరోజూ పరిశుభ్రతపై నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు. పవిత్ర పుణ్యక్షేత్రం కీసరగుట్టను పరిశుభ్రంగా ఉంచడం అధికారుల బాధ్యతతో పాటు ప్రతి భక్తుడి సామాజిక బాధ్యత కూడా. ఇప్పటికైనా సంబంధిత అధికారులు చర్యలు చేపట్టి కీసరగుట్ట పవిత్రతను, పరిశుభ్రతను కాపాడాలని భక్తులు కోరుతున్నారు.