BREAKING
ఉత్కంఠ భరితంగా ఇంటర్ పాలిటెక్నిక్ క్రీడలు -బాలికల వాలీబాల్‌లో పలమనేరు చాంపియన్ -రెండో రోజూ హోరాహోరీ తలపడ్డ క్రీడాకారులు అకాల వర్షాలతో అన్నదాతల ఆందోళన వైసిపి బలపరిచిన రంపచోడవరం సర్పంచ్ గా సంకురు బేబీ కుమారి అఖండ విజయం గ్రామ పంచాయతీ అభివృద్ధే ప్రధాన లక్ష్యం ఎమ్మెల్యే సత్యప్రభను మర్యాదపూర్వకంగా కలిసిన అన్నవరం ఈఓ లక్ష్మీ శివ జ్యోతి రాజ్యాంగాన్ని కాపాడుకుందాం శ్రీపతిరావు పేట లో ప్రచార నిర్వహిస్తున్న సర్పంచ్ అభ్యర్థి చెన్నయ్య రాజ్యాంగంపై యువతకు అవగాహన ఉండాలి ఎస్వీ ఆర్ట్స్ కళాశాలలో రాజ్యాంగ దినోత్సవం -పోటీల విజేతలకు జ్ఞాపికలు, ప్రశంసాపత్రాలు అందజేత అధికారులు ఎన్నికలకు సమాయత్తం కావాలి ప్రత్తిపాడులో బలపడుతున్న వైసీపీ శివలింగాల దర్శనం మహాపాతక నాశనం తిరుపతిలో వైసీపీకి భారీ షాక్.. 3 వేల మందితో టిడిపి లో చేరిన తిరుమల వైసిపి నేత ప్రవీణ్ రాయల్ రేపు ఉదయం 10 గంటలకు ఏపీ కేబినెట్ సమావేశం.. మన ఓటే.. మన భవిష్యత్తు! రాజ్యాంగ విలువలే విద్యార్థులకు మార్గదర్శకం -మహాత్మా గాంధీ మునిసిపల్ పాఠశాలలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవం

నాలుగు ఏకగ్రీవం.. 22 పల్లెల్లో ఎన్నికల సమరం!

Select Suryaa Now
నాలుగు ఏకగ్రీవం.. 22 పల్లెల్లో ఎన్నికల సమరం!

- మంత్రి సుభాష్‌ నియోజకవర్గంలో ఆసక్తికరంగా పంచాయతీ పోరు
- మండల కేంద్రంలోనే కూటమి మద్దతుదారుల మధ్య పోటీ 
- వైసీపీ గ్రామస్థాయి పట్టుపై రాజకీయ వర్గాల్లో చర్చ
- ఈ నెల 29న పోలింగ్‌.. అదే రోజు ఫలితాలు

కాజులూరు, మేజర్ న్యూస్ : రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న రామచంద్రపురం నియోజకవర్గ పరిధిలోని కాజులూరు మండలంలో పంచాయతీ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. మండలంలోని 26 గ్రామ పంచాయతీలకు గాను నాలుగు గ్రామాల్లో సర్పంచ్‌ల ఎన్నిక ఏకగ్రీవమైంది. మిగిలిన 22 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఓ వైపు కూటమి పార్టీల మధ్య గ్రామస్థాయి రాజకీయ సమీకరణాలు, మరోవైపు వైసీపీ తన పట్టును ఎంతవరకు నిలబెట్టుకుంటుందన్న అంశం చర్చనీయాంశంగా మారింది.

మండల కేంద్రంలోనే భిన్నమైన పరిస్థితి..

మండల పరిషత్‌ పదవుల విషయంలో కలిసి పనిచేసిన టీడీపీ, జనసేన శ్రేణుల మధ్య పంచాయతీ ఎన్నికల్లో స్థానిక సమీకరణాలు భిన్నంగా కనిపిస్తున్నాయి. మండల కేంద్రం కాజులూరులో కూటమి మద్దతుదారుగా యాళ్ల వెంకటరమణ, జనసేన మద్దతుదారుగా వట్టూరి పట్టాభిరామయ్య వేర్వేరుగా బరిలో నిలిచినట్లు స్థానిక సమాచారం. మంత్రి సుభాష్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోనే ఇటువంటి పరిస్థితి నెలకొనడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.

వైసీపీ పట్టు ఎంతవరకు..?

గత ప్రభుత్వ హయాంలో గ్రామస్థాయిలో అధికారంలో కొనసాగిన వైసీపీకి ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. రాష్ట్రంలో అధికారం కోల్పోయిన తరువాత గ్రామస్థాయిలో ఆ పార్టీకి ఉన్న పట్టు ఎంతవరకు కొనసాగుతోందన్నది ఈ ఎన్నికలతో స్పష్టమయ్యే అవకాశం ఉంది. అయితే మండలంలో ఎంతమంది వైసీపీ మద్దతుదారులు బరిలో ఉన్నారన్న పూర్తి వివరాలు ఇంకా నిర్ధారణ కావాల్సి ఉంది. పార్టీ గుర్తులు లేకుండా జరుగుతున్న ఎన్నికలు కావడంతో రాజకీయ పార్టీల బలంతో పాటు అభ్యర్థుల వ్యక్తిగత పలుకుబడి కూడా కీలకం కానుంది.

నాలుగు గ్రామాల్లో ఏకగ్రీవం..

అయితపూడి సర్పంచ్‌గా పంపన ఈశ్వరి కిరణి, కుయ్యేరు సర్పంచ్‌గా పెన్నాడ లక్ష్మి, మతుకుమిల్లి సర్పంచ్‌గా సలాది వీర ధనలక్ష్మి, ఉప్పుమిల్లి సర్పంచ్‌గా యాళ్ళ వీర వెంకటరమణ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎంపీడీవో జే.రాంబాబు తెలిపారు.

పల్లె తీర్పుపై అందరి దృష్టి..

కాజులూరు మండలంలో మొత్తం 270 వార్డులు, 57,081 మంది ఓటర్లు ఉన్నారు. ఈ నెల 29న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్‌, మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు జరగనుంది. మంత్రి సుభాష్‌ నియోజకవర్గంలో కూటమి పార్టీల మధ్య సయోధ్య, వైసీపీ గ్రామస్థాయి బలం ఎలా ఉన్నాయన్నది ఈ ఎన్నికల ఫలితాలతో కొంతవరకు వెల్లడి కానుంది. దీంతో కాజులూరు మండల పంచాయతీ ఎన్నికలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.