రాజ్యాంగంతోనే సమాన అవకాశాలు
(షాబాద్ - మేజర్ న్యూస్)
మండలంలోని సంకేపల్లిగూడ గ్రామ పంచాయతీ కార్యాలయంలో గురువారం రాజ్యాంగ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజ్యాంగ పీఠికను చదివి, హక్కులు, బాధ్యతలపై అవగాహన కల్పించారు. రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమాన హక్కులు, అవకాశాలు కల్పిస్తోందని సర్పంచ్ కుమ్మరి లావణ్య చెన్నయ్య అన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ కుమ్మరి చెన్నయ్య, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శి ఫయాజ్, ఇతరులు పాల్గొన్నారు.