భారత రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకోవడం ఎంతో గర్వకారణం, ఆనందదాయకం: మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్*
సూర్య ఖమ్మం, భారతరాజ్యాంగ దినోత్సవం (సంవిధాన్ దివస్) సందర్భంగా మాజీ రవాణా శాఖ మంత్రివర్యులు శ్రీ పువ్వాడ అజయ్ కుమార్ గారు ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగం కలిగిన మన దేశంలో రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకోవడం చాలా ఆనందంగా మరియు గర్వకారణంగా ఉందని అన్నారు.
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి అధ్యక్షతన రూపొందించబడిన మన రాజ్యాంగం దేశంలోని ప్రతి పౌరుడికి సమాన హక్కులు, స్వేచ్ఛ మరియు సామాజిక న్యాయాన్ని అందించిందని ఆయన గుర్తు చేశారు. కుల, మత, ప్రాంతీయ భేదాలకు అతీతంగా దేశ సమగ్రతను, సార్వభౌమత్వాన్ని కాపాడుతున్న మహాగ్రంథం మన రాజ్యాంగమని కొనియాడారు.
ప్రతి ఒక్కరూ రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను అనుభవిస్తూనే, రాజ్యాంగం నిర్దేశించిన ప్రాథమిక విధులను బాధ్యతాయుతంగా నిర్వర్తించాలని ఆయన పిలుపునిచ్చారు. యువత మరియు విద్యార్థులు రాజ్యాంగ విలువలను, అంబేద్కర్ ఆశయాలను ఆదర్శంగా తీసుకుని దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని పువ్వాడ అజయ్ కుమార్ గారు ఆకాంక్షించారు.
బీఆర్ఎస్ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.
కార్యక్రమంలో నాయకులు పగడాల నాగరాజు,బత్తుల మురళి, వీరునాయక్, దేవభక్తిని కిషోర్, ఆరెంపుల వీరభద్రం, హెచ్చు ప్రసాద్,నెమలి కిషోర్, ఈశ్వర్,మాతంగి అనిల్,సాగర్, వెంకట్,అశోక్,వెంకటేశ్వర్లు,సురేష్,వీరేందర్,షకీనా తదితరులు పాల్గొన్నారు.
సూర్య ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో చీఫ్ పసుపులేటి సత్యనారాయణ