3 వేల మందితో టిడిపి లో చేరిన తిరుమల వైసిపి నేత ప్రవీణ్ రాయల్ మేయర్ జె బి శ్రీనివాస్ నాయకత్వంలో పనిచేయడానికి చేరా...
తిరుపతి, మేజర్ న్యూస్:
టిడిపి తిరుపతి నియోజకవర్గం ఇంచార్జ్, తిరుపతి మేయర్ జేబీ శ్రీనివాస్ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమం పట్ల ఆకర్షితులై ఆయన నాయకత్వంలో పనిచేసేందుకు తాను తిరుమలకు చెందిన వైసిపి నాయకులు కార్యకర్తలతో కలిసి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు వైసీపీ తిరుమల యువజన విభాగం అధ్యక్షులు ప్రవీణ్ రాయల్ తెలిపారు. గురువారం కరకంబాడి రోడ్డులోని ఒక ప్రైవేటు ఫంక్షన్ హాల్ లో శాప్ చైర్మన్అనిమిని రవి నాయుడు, మేయర్, టిడిపి నియోజకవర్గ ఇన్చార్జి జేబీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పార్టీలో తిరుమల కు చెందిన వైసిపి నాయకులు కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ప్రవీణ్ రాయల్ తో పాటు తిరుమల వైసీపీ నాయకులకు కార్యకర్తలకు మేయర్ జేబీ శ్రీనివాస్, శాప్ చైర్మన్ లు టిడిపి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు.
జేబీ శ్రీనివాస్ టిడిపి తిరుపతి నియోజకవర్గ ఇన్చార్జిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి తిరుపతిలో వైసిపి పార్టీకి చెందిన పలువురు నాయకులు కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో చేరారు. మేయర్ జె బి శ్రీనివాస్ తిరుపతి నియోజకవర్గానికి, తిరుపతి అభివృద్ధికి చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల పట్ల యువత, విద్యార్థులు పెద్ద ఎత్తున ఆకర్షితులై ఆయన నాయకత్వంలో పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే వేలాదిమంది వైసీపీ కార్యకర్తలు టిడిపిలో చేరారు. ఈ సందర్భంగా మేయర్ జేపీ శ్రీనివాస్, శాప్ చైర్మన్ రవి నాయుడు లు మాట్లాడుతూ ప్రవీణ్ రాయల్ నాయకత్వంలో 3000 మంది పార్టీలో చేరడం సంతోషకరమని చెప్పారు. గత వైసిపి ప్రభుత్వ హయాంలో యువత మద్యానికి, గంజాయి మత్తుకు బానిసలై జీవితాలను సర్వనాశనం చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దానివల్ల వందలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయని తెలిపారు. మేయర్ టిడిపి నియోజకవర్గ ఇన్చార్జి జేబీ శ్రీనివాస్ నాయకత్వంలో యువత గంజాయి కు దూరంగా ఆరోగ్యకరమైన భవిష్యత్తు, అభివృద్ధి వైపు అడుగులు వేయాలని యువతకు తాము పిలుపునిచ్చామని చెప్పారు. గంజాయి మహమ్మారిని దూరం చేద్దాం యువత భవిష్యత్తును కాపాడుకుందాం అనే నినాదంతో యువతలో చైతన్యం తీసుకురావాలని వారు సూచించారు. తిరుమల ప్రవీణ్ రాయల్ చేరికతో ఫంక్షన్ హాల్ అంతా యువత కేరింతలు పార్టీ నినాదాలతో హోరెత్తింది. తిరుమలకు చెందిన 3,000 మంది ఒకేసారి టిడిపిలో చేరడం పట్ల తిరుపతి మేయర్ జేబీ శ్రీనివాస్ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల పట్ల ఆకర్షితులవుతున్నారని పలువురు మేధావులు చెప్పుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో
ఎస్ వి బి సి చైర్మన్ శ్రీధర్ వర్మ శ్రీ తాతయ్య గుంట గంగమ్మ గుడి చైర్మన్ నైనారు మహేష్ యాదవ్, క్లస్టర్ ఇన్చార్జులు సూరా సుధాకర్ రెడ్డి, బిజీ కృష్ణ యాదవ్ కార్పొరేటర్లు నైనార్ రమేష్ యాదవ్, కాయం వెంకటరత్నం, చల్లకలై, ఆర్ఆర్ యాదవ్, సుబ్బు యాదవ్, సుద్దాల రాజు యాదవ్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
H. ద్వారకా, స్టాఫ్ రిపోర్టర్
9705347341.