గిరిజన ఆడపడుచులకు అండగా ‘శ్రీ సాంబశివ చారిటబుల్ ట్రస్ట్
గిరిజన ఆడపడుచులకు అండగా ‘శ్రీ సాంబశివ చారిటబుల్ ట్రస్ట్
-- వివాహ కానుక 10,116
-- వధూవరులకు పట్టు వస్త్రాలు అందజేసిన చైర్మన్ శ్రీ కంచి పరమేశ్వర రెడ్డి
ఆత్మకూరు, మేజర్ న్యూస్ :
ఆత్మకూరు మునిసిపాలిటీ 22వ వార్డు ఏసీఎస్సార్ కాలనీలోని ఎస్టీ కుటుంబానికి చెందిన పేద గిరిజన యువతి చలంచర్ల వెంగమ్మ వివాహానికి ‘శ్రీ సాంబశివ చారిటబుల్ ట్రస్ట్’ చైర్మన్ శ్రీ కంచి పరమేశ్వర రెడ్డి పెద్ద దిక్కుగా నిలిచారు. గిరిజన ఆడపడుచులకు పెళ్లి కానుక పథకం కింద వధువుకు 10,116 రూపాయల నగదు చెక్కుతో పాటు నూతన పట్టు వస్త్రాలను దంపతులు ఇరువురికి అందజేసి ఆశీర్వదించారు.
గిరిజన ప్రాంతాల్లో అవగాహన పెంచి బాల్య వివాహాలను పూర్తిగా అరికట్టడమే ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యమని ఈ సందర్భంగా పరమేశ్వర రెడ్డి పేర్కొన్నారు.పరమేశ్వర రెడ్డి కేవలం వివాహ సాయానికే పరిమితం కాకుండా, ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలలో రోగులకు మధ్యాహ్నం, రాత్రి వేళల్లో నిరంతర అన్నప్రసాద కార్యక్రమాలు మరియు అనేక సేవా కార్యక్రమాలను నిర్విరామంగా నిర్వహిస్తూ ఈ ప్రాంత ప్రజలకు ఒక పెద్దన్నలా ఆపద్బాంధవుడిగా నిలుస్తున్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న గిరిజన పెద్దలు మాట్లాడుతూ ముఖ్యంగా గిరిజన ఆడపడుచులకు ఆయన అందజేస్తున్న పెళ్లి కానుకలు ఆ కుటుంబాల్లో అంతులేని సంతోషాన్ని నింపుతున్నాయని, ఆ పెళ్లి కుమార్తెల ముఖాల్లోని ఆనందం మరియు వారి కుటుంబ సభ్యుల ఆప్యాయత ఎంతో గొప్పవని వారు కొనియాడారు.
తండ్రి స్థానంలో నిలబడి పెండ్లి కానుక 10,116 మరియు వధూవరులకు పట్టు వస్త్రాలను అందించడం పట్ల వధువు మరియు ఆమె కుటుంబ సభ్యులు ఆ యొక్క కాలనీవాసులు ఆనందం వ్యక్తం చేస్తూ పరమేశ్వర రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
శ్రీ సాంబశివ చారిటబుల్ ట్రస్ట్ లక్ష్యం మానవసేవయే మాధవసేవ అని పరమేశ్వర రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ప్రతినిధులు జయేంద్ర ప్రసాద్ రెడ్డి, నరసింహా రెడ్డి తదితరులు పేర్కొన్నారు.