BREAKING
పెదగదిలి ప్రభుత్వ పాఠశాలలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు సంతు సేవాలాల్ మహారాజ్ విగ్రహం, ఆలయ నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమానికి తరలిన రూప దీప నైవేద్య భోగ్ బాబోజీల వాహనాలు కాంగ్రెస్ జెండా ఊపి వాహనాలను ప్రారంభించిన ఎమ్మెల్యే బాలు నాయక్ . తెలంగాణ చరిత్ర, సంస్కృతిని భావితరాలకు అందించాలి.. చారిత్రక పద్య నాటకాలు యువతలో స్ఫూర్తిని నింపాలి: ప్రజా గాయిని వేముల పుష్పక్క నూతన వధూవరులను ఆశీర్వదించిన దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ ఓటు హక్కుకు రక్షణగా పోలీసు పహారా! ఎన్నికల సందర్బంగా బస్ సర్వీసుల తగ్గింపు బెనెకల్ లో రీకౌంటింగ్ జరగాలంటూ వందలాది మంది జనసేన కార్యకర్తలతో ఆందోళన - రాయదుర్గం ఇంచార్జి మంజునాథ్ గౌడ్ డిమాండ్!! మహిమలూరు లో నిరుపయోగ నిర్లక్ష్య భవనం --నిధులు వృధా,స్థలదాతల వ్యధ గ్రామ అభివృధి కి సహకరిస్తా ఆత్మకూరుకు పట్టణ శోభ యోగం ఎన్నటికో -అన్నీ ఉన్నా అల్లుడు నోట్లో శని చందం దీక్షతో దశ దిశలా తెలంగాణ ఉద్యమం! ఆమరణ దీక్ష.. ఆత్మగౌరవ ఉద్యమానికి మహా ప్రస్థానం! కేసీఆర్ సంకల్పం.. తెలంగాణ ప్రజల స్వప్నం! దీక్షా దివస్‌కు దేవరకొండలో భారీ ఏర్పాట్లు 29న దేవరకొండలో ఘనంగా దీక్షా దివస్ సమావేశం రమావత్ రవీంద్ర కుమార్, మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నల్గొండ జిల్లా అధ్యక్షుడు భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు సర్పంచ్ అభ్యర్థిగా 8 ఓట్స్ తో గెలుపు పమిడిపాడు లో సర్పంచ్ అభ్యర్థి ధనమ్మ ముమ్మర ప్రచారం ప్రజాసేవలో కొత్త బాధ్యతలు చేపట్టిన డాక్టర్ బొమ్మిరెడ్డి షకీలాకు అభినందనల పరంపర

మహిమలూరు లో నిరుపయోగ నిర్లక్ష్య భవనం --నిధులు వృధా,స్థలదాతల వ్యధ

Select Suryaa Now
మహిమలూరు లో నిరుపయోగ నిర్లక్ష్య భవనం --నిధులు వృధా,స్థలదాతల వ్యధ

మహిమలూరు లో నిరుపయోగ నిర్లక్ష్య భవనం --నిధులు వృధా,స్థలదాతల వ్యధ 
ఆత్మకూరు, మేజర్ న్యూస్: ఆత్మకూరు మండలం మహిమలూరు లో గత 18 సంవత్సరాలుగా ఓ అర్ధాంతర నిర్మాణ భవనం అధికారులు ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనంగా దర్శనమిస్తుంది.స్లాబ్ వరకు నిర్మాణం జరిగిన ఈ భవనం వృధాగా ఉండగా భవన నిర్మాణానికి స్థలం విరాళంగా సమకూర్చిన దాతలు ఆవేదన చెందుతున్నారు. ఆత్మకూరు ప్రాంతంలో అనేక భవనాలు చూస్తుంటే ప్రభుత్వం నిధులకు జవాబుదారీతనం లేనందనేందుకు సాక్షాలుగా ఉన్నాయి. మహిమలూరులో పొదుపు మహిళల సౌకర్యార్థం అప్పుడు డిఆర్డిఏ అధికారులు ఒక డ్వాక్రా భవన నిర్మాణం కోసం ఒకటి. ఐదు లక్షల రూపాయలు నిధులు మంజూరు చేశారు. ఈ భవనం నిర్మిస్తే మహిళలు ఏదైనా సమావేశాలు జరుపుకోవాలని భావించి ఆ గ్రామానికి చెందిన తోట వెంకట శేషయ్య, చంద్రశేఖర్, సుధాకర్, బాబులు తమ తండ్రి తోట నాగయ్య జ్ఞాపకార్థం 20 అంకణాల స్థలం కేటాయించారు. విరాళంగా ఇచ్చిన స్థలంలో భవన నిర్మాణం ప్రారంభించి స్లాబ్ పూర్తయింది. అనంతరం నిధుల కొరతతో నిర్మాణం నిలిచిపోయింది.ఇక అంతే ఆ నాటి నుండి ఎంతగా అరిచి గీపెట్టిన ఈ భవనానికి మోక్షం లభించడం లేదు. చుట్టూరా కంపచెట్లు పెరిగిపోగా తాత్కాలికంగా ఇరుపొరుగు వారు తమ అవసరాలకు వినియోగించుకుంటున్నారు. ఈ భవన నిర్మాణం పూర్తి చేసేందుకు నిధులు కేటాయించి వినియోగం లోకి తేవాలని పదే పదే పత్రికలు ఘోషించినా పట్టించుకున్న నాధుడే కరువయ్యారు. గ్రామంలోకి అడుగుపెట్టగానే దర్శనమిచ్చే ఈ భవనం గురించి ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ ఏమాత్రం పట్టించుకున్న దాఖలా లేనే లేవు. ఆత్మకూరు ప్రాంతంలో ఇలాంటి భవనాలు అక్కడక్కడ దర్శనం ఇస్తుంటాయి. సాతానుపల్లి సమీపంలో ఒక పాఠశాల భవనం నిర్మించగా రెండు దశాబ్దాలుగా నిరూపయోగంగానే  ఉన్నాయి. పట్టణంలో ఏసీ నగర కాలనీలో ఒక కమ్యూనిటీ హాల్  నిరుపయోగంగా ఉంటుండగా సచివాలయానికి తాత్కాలికంగా వినియోగిస్తున్నారు.పాత జంగాల పల్లెలో పాఠశాల లేకుండానే ఒక భవనం నిర్మించగా ఎలాంటి వినియోగం లేకుండానే శిదిలమై పోయింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి మహిమలూరు డ్వాక్రా భవనానికి మోక్షం కల్పించాలని పలువురు గ్రామస్తులు కోరుతున్నారు.