. తెలంగాణ చరిత్ర, సంస్కృతిని భావితరాలకు అందించాలి.. చారిత్రక పద్య నాటకాలు యువతలో స్ఫూర్తిని నింపాలి: ప్రజా గాయిని వేముల పుష్పక్క
నకిరేకల్ మండలం చందుపట్ల గ్రామంలో వివేకానంద యువజన మండలి చందుపట్ల, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో రాణి రుద్రమదేవి వర్ధంతి సందర్భంగా నిర్వహించిన సమ్మక్క సారలమ్మ, మహారాణి రుద్రమదేవి చారిత్రక పద్య నాటక ప్రదర్శనలు కార్యక్రమంలో ప్రజా గాయిని వేముల పుష్పక్క గారు పాల్గొన్నారు.నవంబర్ 26 సమ్మక్క సారలమ్మ, నవంబర్ 27న మహారాణి రుద్రమదేవి చారిత్రక పద్య నాటకాలను కళాకారులు ప్రదర్శిస్తుండగా పుష్పక్క గారు కళాకారులను నిర్వాకులను అభినందించి, తెలంగాణ చరిత్ర, సంస్కృతిని భావితరాలకు అందించడంలో ఇలాంటి కార్యక్రమాలు ఎంతో అవసరమని అన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, యువజన మండలి సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.